ప్రెస్ రిలీజ్. తేది 07.08.2021
పల్లె ప్రగతి పనులను సరిగ్గా పర్యవేక్షణ చేయనందుకు, హరితహారం మొక్కలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సదాశివ నగర్ మండల పంచాయతీ అధికారి లక్ పతి నాయక్ ను శనివారం సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బందిని సమన్వయం చేయకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఎంపీవో ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
. DPRO..Kamareddy.