07.08.2021 మిర్యాలగూడ పట్టణం రైతు ల సమావేశంలో రాష్జ్ వ్యవసాయ శాఖామంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి

తెలంగాణ .. భూమికి పచ్చాని రంగేసినట్లుంది
నీటి గోస ఏంటిదో మా పాలమూరు ప్రజలకు తెలుసు
ఈ రోజు తెలంగాణ  ఎటు నుండి ఎటు చూసినా గోరటి వెంకన్న పాట రాసినట్లు భూమికి పచ్చాని రంగేసినట్లు కనిపిస్తుంది
తెలంగాణ రాష్ట్ర సాధనతో మారిన ముఖచిత్రమిది
1200 ఫీట్లేసినా బోరులో నీరు రాని పరిస్థితి ఒకప్పుడు
ఇప్పుడు అదే బోరు నుండి తెలంగాణ వచ్చాక మోటారు వేయకుండానే నీళ్లు బయటకు వచ్చాయి
వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురంలో రైతు అంజయ్య స్వీయ అనుభవం ఇది
కేసీఅర్ నాయకత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇది సాధ్యమయింది
ప్రపంచంలో అత్యధిక సాగు భూమి ఉన్న దేశాల్లో అమెరికా మొదటి, భారత్ రెండవ, చైనా మూడో స్థానంలో ఉన్నాయి
పంట ఉత్పత్తులలో చైనా మొదటి, అమెరికా రెండవ, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి
అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో కూడా రైతుకు వ్యవసాయానికి ఉచిత కరంటు ఇవ్వడం లేదు
మట్టిని నమ్ముకున్న రైతన్నకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలు అమలు చేయడం లేదు .. కేవలం తెలంగాణ లోనే అమలు చేస్తున్నారు
ఇంత గొప్ప పథకాలు అమలు జరుగుతున్నది కేవలం కేసీఆర్ నాయకత్వం మూలంగానే
రాష్ట్ర, దేశ సంపదను పెంచడంలో వ్యవసాయ రంగానికి మించిన రంగం లేదన్న విషయం గుర్తించే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయరంగానికి చేయూత నిచ్చారు
కేసీఆర్ గారి దూరదృష్టికి నిదర్శనమే వ్యవసాయరంగ బలోపేతం
రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు, రుణమాఫీ పథకాలతో పాటు సాగునీటి కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా సగటున ఈ రంగం మీద దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
తెలంగాణలో కోటిన్నర ఎకరాలలో పంటల సాగు జరుగుతున్నది
14 ఏండ్లు ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ఎలా నిబద్దతతో పోరాడామో .. తెలంగాణ నవ నిర్మాణంలో అదే చిత్తశుద్దితో ముందుకు సాగుతున్నాం
రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, ఉచితకరంటు, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ వంటి పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
కరోనా కష్టకాలంలో రైతుల పంటలను మద్దతుధరకు కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న వాళ్లు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు లేవు
అభివృద్ధికి సహకరించడం మానేసి కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు
జీఎస్టీ వసూలు పేరుతో రాష్ట్రాల నిధులు కేంద్రం ఎత్తుకెళ్తున్నది .. మన డబ్బులు తీసుకెళ్లి దేశానికి ఖర్చు పెడుతున్నారు
కేసీఆర్ ను గెలవాలంటే విపక్షాలు విజ్ఞత లేని విమర్శలు మాని కేసీఆర్ కన్నా ఎక్కువగా తెలంగాణ గురించి ఆలోచన చేయాలి
మా నీళ్లు మాగ్గావాలె అని నీళ్లతో నిప్పులు పుట్టించి తెలంగాణను సాధించిన నేత కేసీఆర్ గారు
తిండిగింజలు లేక వలసెల్లిన దుస్థితి నుండి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకుంది
ఈ స్థితి నుండి మరింత ఉన్నత స్థితికి చేరుకుని రైతులు ఆర్థికంగా స్థిరపడి నిలబడేందుకే రైతువేదికలు
రైతులకు రైతువేదికలలో నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి
పంటలసాగులో పెట్టుబడి తగ్గించాలి
ఏటా రెండు సార్లు భూసార పరీక్షలు చేయించాలి
యాసంగిలో నూనెగింజలు సాగు మీద రైతులు దృష్టి సారించాలి .. వరి సాగు తగ్గించాలి
తెలంగాణ రైతుల విజయగాధలు రైతువేదికలలో ప్రసారం చేయడం మూలంగా ఇతర రైతులకు స్ఫూర్తినివ్వాలి
రైతులు, వ్యవసాయం సుభిక్షంగా ఉంటేనే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది
కరోనా కష్టకాలంలో ప్రపంచాన్ని కాపాడింది వ్యవసాయరంగమే
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతువేదిక ప్రారంభోత్సవం అనంతరం సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ తిప్పన విజయసింహా రెడ్డి గారు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు రాంచందర్ నాయక్ గారు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ గారు తదితరులు

Share This Post