నిజామాబాద్, సెప్టెంబర్ 7:—
భారీ వర్షాల వల్ల నగరంలో జలమయమైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పర్యటించి పరిశీలించారు.
మంగళవారం మున్సిపల్ ఇతర అధికారులతో పట్టణంలోని బైపాస్ రోడ్డు లో గల చంద్రశేఖర్ కాలనీలో జలమయమైన ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మున్సిపల్ సిబ్బందితో పనులు పూర్తి చేయిస్తామని వర్షపునీరు నిలవకుండా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా
అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.
అంతకు ముందు కలెక్టరేట్ నుండి బస్టాండ్ వెనుకభాగం,దేవి రోడ్డు, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బోధన్ రోడ్డు, ఆటోనగర్ చౌరస్తా, అర్సపల్లి ప్రాంతాలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు: