07-09-2021: లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన కలెక్టర్ సి నారాయణ రెడ్డి

లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన కలెక్టర్

నిజామాబాద్, సెప్టెంబర్ 7:–

నగరంలోని లోతట్టు ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను, నీటమునిగిన ఇండ్లను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు.

మంగళవారం నగరంలోని ఆటోనగర్, నయా బ్రిడ్జి ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, ఇండ్లు పరిశీలించారు. టీంలను ఏర్పాటు చేసి నష్టాన్ని అంచనా వేయించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం గోపన్ పల్లి నిర్వాసితులు గంగ స్థానం ప్లే స్టోర్ లో కొత్త అపార్ట్ మెంట్ లో పునరావాసం పొందుతున్న 32 కుటుంబాలు 120 మందికి, పాంగ్రా భట్ రాజ్ సంఘంలో 15 కుటుంబాలు 60 మందికి దుప్పట్లు అందజేశారు. భోజన ఏర్పాట్లు చేశారు. మెడికల్ టీమ్ను ఏర్పాటు చేశారు.

కలెక్టర్ వెంబడి కలెక్టర్లు చిత్ర మిశ్రా,చంద్రశేఖర్, ఇరిగేషన్ సి ఈ మధుసూదన్ రావు, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, ఆర్ డి ఓ రవి, తహసిల్దార్లు ప్రశాంత్ కుమార్, చాంద్ భాష మున్సిపల్ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

Share This Post