07.09.2021 Nalgonda Dist ప్రజలందరూ మట్టి గణపతులను పూజించి పర్యవరణము ను కాపాడాలని కోరారు: అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ

భారత దేశంలో జరూపుకునే  ప్రతి పండుగ మనుషులను ప్రకృతికి దగ్గరగా చేర్చే విదంగా ఉంటుంది, అంతేకాకుండా పండుగ వలన కలిగే లాభాలు శాస్త్రీయంగా కూడా ఉండడం విశేషం. కలేక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో మట్టిగణపతి విగ్రహం వలన ప్రకృతి ఏవిదంగా మేలు జరుగుతుందో ప్రకృతి ప్రేమికుడు సురేష్ గుప్త మిట్టపల్లి అడిషనల్ కలెక్టర్ గారికి వివరించడం, వినాయక విగ్రహం తోపాటు చేతి సంచి చేనేత వస్త్రాలు, సిరిధాన్యాలు అందించి నవరాత్రి ఉత్సవాల లో జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ ,ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ నివారణ, చేనేత/ఖాదీ లాభాలు, గోధారిత వ్యవసాయం వలన లాభాలు, సిరిధాన్యాల వలన లాభాలు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి అన్నారు, అలానే ఇప్పటికే ఐక్యరాజ్య సమితి సిరిధాన్యాలను 2023 సంవత్సరానికి సిరిధాన్యాల సంవత్సరం గా ప్రకటించడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ గారు మాట్లాడుతూ ప్రజలందరూ మట్టి గణపతులను పూజించి పర్యవరణము ను కాపాడాలని కోరారు, ఈ కార్యక్రమంలో PCB EE, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి గారు, RTC, సివిల్ సప్లై, ట్రాఫిక్, పరిశ్రమల శాఖ భాద్యులు పాల్గొన్నారు.

Share This Post