08.09.2021 Nalgonda Dist *నల్గొండ జిల్లా నకిరేకల్ చెరువు లో ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి*

*పత్రికా ప్రకటన*                                    *నల్గొండ జిల్లా నకిరేకల్ చెరువు లో ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి*                               నకిరేకల్,సెప్టెంబర్ 8. వ్వ్యవసాయ,అనుబంధ రంగాలకు ప్రాధాన్యత నిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.బుధవారం నకిరేకల్ పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ లో భాగంగా చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా గ్రామీణ,చేతి వృత్తుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా మత్స్యకారుల  జీవితాల్లో వెలుగులు నింపాలని ఉచిత చేప పిల్లల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి 60 శాతం పైగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ, వ్యవసాయం, చేతివృత్తులకు ప్రోత్సాహం,పాడి పరిశ్రమ, గొర్రెల పంపిణీ  లాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తోడ్పడుతున్నట్లు తెలిపారు.మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసినట్లు,చేరువులపై ఆధారపడిన మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా ఆర్ధిక తోడ్పాటు,చేప పిల్లల ఉత్పత్తి తో రాష్ట్ర ఆదాయం మెరుగుపడుతుందని అన్నారు. జిల్లా మత్స్య శాఖ అధికారి చరిత మాట్లాడుతూ నకిరేకల్ పెద్ద చెరువులో లక్ష చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం లో భాగంగా చేప పిల్లలను చెరువులోకి రాష్ట్ర విద్యుత్ శాఖ  మంత్రి జి.జగదీశ్ రెడ్డి వదలినట్లు తెలిపారు.నకిరేకల్ పెద్ద చెరువు లో లక్ష చేప పిల్లలు అందులో మూడు రకాలు వదలి నట్లు వెల్లడించారు. కట్ల 40 వేలు,రోహ 50 వేలు,  మ్రీగాల 10 వేల చేప పిల్లలు వదలి నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,డి.ఆర్.ఓ.జగదీశ్వర్ రెడ్డి,స్థానిక శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య,మున్సిపల్ కమిషనర్ బాలాజీ,డి.ఎస్.పి.వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.                   ———————————–సహాయ సంచాలకులు,సమాచార శాఖ,నల్గొండ చే జారీ చేయనైనది

Share This Post