08-11-2021 నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 14 2021 వరకు బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.

ప్రెస్ రిలీజ్. తేది08.11.2021

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వారోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. ఆడపిల్లలపై వివక్షత , బేటీ బచావో బేటీ పడావో, భ్రూణ హత్యల నిర్మూలన తదితర విషయాలపై అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు పేయింటింగ్, డ్రా యింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీలు, రక్షాబంధన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం బాలల హక్కుల వారోత్సవాల గోడ ప్రతుల ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్వేత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవ రావు, జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి, బాల రక్ష భవన్ కో ఆర్డినేటర్ జానకి,బాలల రక్షణ అధికారి స్రవంతి, చైల్డ్ లైన్ 1098 కో ఆర్డినేటర్ అమృత రాజేందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post