08-11-2021 మద్యం షాపులు కేటాయింపు కులాల వారిగా లక్కీ డ్రా ను తీసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

ప్రెస్ రిలీజ్. తేది 08.11.2021 జిల్లా మద్యనిషేధ, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం మద్యం షాపుల రిజర్వేషన్లు లక్కీడ్రా ద్వారా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లక్కీ డ్రా ను తీశారు. జనరల్ కు 35, గౌడ కమ్యూనిటీ 7, ఎస్సీ కమ్యూనిటీ 5, ఎస్టి కమ్యూనిటీకి రెండు చొప్పున కేటాయించారు. కార్యక్రమంలో జిల్లా మద్యనిషేధ, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా వెనుకబడిన కులాల సంక్షేమ అధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy

Share This Post