09.08.2021 పత్రికా ప్రకటన* *క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమర యోధుడికి సన్మానం*

 నల్గొండ,ఆగస్ట్ 9. క్విట్ ఇండియా ఉద్యమం 1942 లో పాల్గొన్న స్వాతంత్ర్య సమర యోధుడు పి.అనంత రామ శర్మను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి లు సన్మానించారు.ఆదివారం నల్గొండ పట్టణం లో ఆయన ఇంటికి వెళ్లి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి లు పూల మాల వేసి,శాలువా తో ఆయనను సత్కరించారు.ఆయనతో పాటు సమకాలికులు దాడి వెంకట రెడ్డి,కమలమ్మ లను కూడా సన్మానం చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్విట్ ఇండియా వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లో 10 మంది స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించి రాష్ట్ర పతి చేతుల మీదుగా సన్మానం చేయాలని నిర్ణయించి,కోవిడ్ కారణంగా నల్గొండ జిల్లా నుండి  గుర్తించిన పి.అనంత రామశర్మ ను సన్మానం చేయాలని కేంద్ర,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం మేరకు ఆయన ఇంటికి వెళ్లి సన్మానం చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య ఉద్యమం లో ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ సంపూర్ణ ఆరోగ్యం తో జీవించాలని కలెక్టర్, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డిలు ఆకాంక్షించారు.పి.అనంత రామ శర్మ 15 ఏండ్ల వయస్సు లో కొరియర్ (రహస్యంగా ఉత్తర సమాచారం అందించడం) గా పనిచేస్తూ దళాల మధ్య ఉత్తర,ప్రత్యుత్తరాలు,సమాచారాలు చేరవేసేవారు.స్వాతంత్ర్య పోరాటం లో చాలా చురుకుగా పోరాటం చేస్తూ,వెట్టి చాకిరి విముక్తి కొరకు కూడా పోరాటం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ.జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎం.సైది రెడ్డి,పుర ప్రముఖులు పాల్గొన్నారు

Share This Post