09.09.2021 Nalgonda Dist *జాతీయ రహదారుల నిర్మాణ సంబంధ సమస్యలు సమన్వయం తో పరిష్కారం:అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్*

నల్గొండ, సెప్టెంబర్ 9.జాతీయ రహదారుల నిర్మాణ ముందు ఏర్పడే సమస్యలు ఆయా శాఖలు సమన్వయంతో పరిష్కారం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉదయాదిత్య భవన్ లో డిస్ట్రిక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్  కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించి జాతీయ రహదారుల నిర్మాణం లో ఎదురయ్యే అడ్డంకులు  వివిధ శాఖల అధికారులతో సమావేశం జరిపి అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ననుసరించి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా,ఎస్.పి.,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సభ్యులుగా,అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మెంబర్ కన్వీనర్ గా డిస్ట్రిక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కమిటీ లో అటవీ, ఇంజినీరింగ్ శాఖల అధికారులు,విద్యుత్ ,నేషనల్ హైవే అథారిటీ శాఖల సభ్యులు ఉంటారని అన్నారు.ఎన్. హెచ్.167 కల్వకుర్తి నుండి కోదాడ వరకు(జిల్లాలో పెద్ద వూర,హాలియా,నిడమనూర్,మిర్యాలగూడ,),ఎన్. హెచ్ 565 నకిరేకల్ నుండి నాగార్జున సాగర్ వరకు నిర్మాణ ముందు భూ సమస్యలు,సౌకర్యాలు షిఫ్టింగ్, అటవీ క్లియరెన్స్ ఇతరత్రా సమస్యలు సమావేశం లో సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు.మళ్ళి తదుపరి సమావేశం నిర్వహించి సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ సమావేశం లో పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ. కందుకూరి వెంకటేశ్వర్లు, ఆర్&బి ఎస్.ఈ. నరసింహ,ఆర్.డి.ఓ.లు జగదీశ్వర్ రెడ్డి, గోపి రాం, రోహిత్ సింగ్,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

–——————————-జారీ చేసిన వారు,సహాయ సంచాలకులు,సమాచార శాఖ,నల్గొండ.

Share This Post