09-09-2021 Nalgonda Dist పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి ఆరాధించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.

నల్గొండ, 09, సెప్టెంబర్ 2021: ——————————-
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి ఆరాధించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్  కార్యాలయం లో కాలుష్య నియంత్రణ  మండలి నల్గొండ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం సిబ్బందికి మట్టి   విగ్రహల పంపిణీ కార్యక్రమంలోజిల్లా కలెక్టర్ పాల్గొని పంపిణీ చేశారు
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.
రసాయనాలు, రంగులు లేని మట్టి వినాయకులను పూజించి పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలు సహకరించాలని  కోరారు.
ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీ్‌సతో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి హాని కలిగే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా జల చరాలు ప్రమాదంలో పడే ప్రమాదం ఉందన్నారు.
రంగు రంగులతో కూడిన పెద్ద  వినాయకుడి విగ్రహాన్ని పెట్టామన్నది ముఖ్యం కాదని, ఎంత భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజించామన్నది ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. భక్తి భావం నింపుకొని, నియమ నిష్ఠలతో పూజలు చేస్తే కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందన్నారు.
కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు ఉచితంగా ప్రతి వినాయక చవితి సందర్భంగా పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు.పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్ లో , చాలా చోట్ల ఈ విగ్రహాల పంపిణీ జరుగుతోందన్నారు.
కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ సహాయ శాస్త్రవేత్త రవీందర్, సమాచార శాఖ ఏ.డి.శ్రీనివాస్,జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.
*క్లాక్ టవర్ సెంటర్ లో కాలుష్య నియంత్రణ మండలి ఆద్వర్యం లో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ*
కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నల్గొండ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్లో ఉచితంగా మట్టి గణపతి విగ్రహ ప్రతిమ లు పంపిణీ చేశారు. నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి లు పాల్గొని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ తో పాటు కుల వృత్తి పై ఆధార పడిన కుమ్మరు లకు తోడ్పాటు అందించిన వారమవుతామని అన్నారు.ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ గణేష్ చతుర్థి పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని అన్నారు.ప్రతి గ్రామం లో మట్టి విగ్రహ ప్రతిమలు పూజించి పర్యావరణ కాలుష్య నివారణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నల్గొండ పర్యావరణ సహాయ  శాస్త్రవేత్త రవీందర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర కార్యాలయం ఆద్వర్యం లో 33 జిల్లాలలో  ఉచితంగా మట్టి గణపతి విగ్రహ ప్రతిమలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ కాలుష్య నియంత్రణ మండలి జూనియర్ శాస్త్ర వేత్త డా.పురుషోత్తం రెడ్డి, మున్సిపల్ ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్ ప్రసాద్,మున్సిపల్ డి.ఈ. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
–——————————-జారీ చేసిన వారు,సహాయ సంచాలకులు,సమాచార శాఖ,నల్గొండ.

Share This Post