09.09.2021 Nalgonda Dist *ప్రజాకవి కాళోజి:అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్*

పత్రికా ప్రకటన*       *ప్రజాకవి కాళోజి:అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్*                           నల్గొండ,సెప్టెంబర్ 9.
ప్రజల గురించి, ప్రజలకోసం, ప్రజల భాషలో కవిత్వం రాసిన అచ్చమైన ప్రజాకవి కాళోజీ అని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో  కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రసిద్ధకవుల్లో కాళోజీ ఒకరు. కాళోజీ కవిత్వమంతా నిరంతరం తన చుట్టూ జరుగుతున్న సామాజిక సంఘటనలను ఆశ్రయించి ఉంటుందని అన్నారు. తన భావాలను వీలైనంత తేలికగా వ్యక్తం చేయడమే కాళోజీ లక్ష్యం. తన కవిత్వంలో ప్రజా జీవితాన్ని చిత్రించిన ప్రజాకవి కాళోజీ అని అన్నారు
నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు. ఆయన స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణా ఉద్యమ కారుడు. ఆయన 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం “పద్మ విభూషణ్” పొందాడు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం “తెలంగాణ భాషా దినోత్సవం”గా చేసి గౌరవించిందని తెలిపారు. వరంగల్ లో నెలకొన్న వైద్య విద్యాలయానికి “కాళోజీ పేరు” పెట్టబడిందని అన్నారు ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి.*
*అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించి స్ఫూర్తి నింపారని అన్నారు.
తెలంగాణ రచయితల సంఘ్ అధ్యక్షుడిగా, తెలంగాణ రచయితల వేదిక గౌరవ అధ్యక్షుడిగా పనిచేసి, తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేశారని అన్నారు.ఈ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి మోతీ లాల్,తదితరులు పాల్గొన్నారు.                  –———–———————జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ,నల్గొండ

Share This Post