10 రోజుల్లో వైకుంఠ దామం లు పూర్తి చేయాలి : అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

పత్రికా ప్రకటన వైకుంఠ దామం లు 10 రోజుల్లో పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ గుర్రం పోడ్,సెప్టెంబర్ 23.వివిధ దశల్లో నిర్మాణం లో ఉన్న వైకుంఠ దామం లు 10 రోజుల్లో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం గుర్రం పోడ్ మండలం లో పర్యటించి వివిధ గ్రామాల్లో వైకుంఠ దామం ల నిర్మాణ ప్రగతి ని ఆయన పరిశీలించారు. మండలంలోని కొప్పోలు జి.పి.,చామలోని బావి,పిట్టల గూడెం జి.పి., ముల్కల పల్లి జి.పి.,జున్నూ తల జి.పి.లలో పర్యటించి వైకుంఠ దామం ల నిర్మాణాలను పరిశీలించి నిర్మాణ ప్రగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.నిర్మాణం లో వివిధ దశలలో ఉన్న వాటిని 10 రోజుల్లో పూర్తి చేయాలని ఎం.పి.డి.ఓ.ను ఆయన ఆదేశించారు.

Share This Post