10 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు ఎవరికీ ఏమీ కాలేదు, తీసుకోకుంటే థర్డ్ వేవ్ ప్రమాదం – కలెక్టర్ డిసెంబర్ కల్లా రెండు విడతల వ్యాక్సిన్ ఒక యజ్ఞంలా పూర్తి చేయాలి – జడ్పీ చైర్మన్

డిసెంబర్ చివరి నాటికి తప్పనిసరి రెండు డోస్ లు వ్యాక్సిన్ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు ప్రజలను కోరారు.

గురువారం కరోనా వ్యాక్సినేషన్ పై కలెక్టర్ జడ్పీ చైర్మన్ తో కలిసి మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ డిసెంబర్ 31 వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం యజ్ఞంలా పూర్తి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేపటి నుండి వ్యాక్సినేషన్ ఒక డ్రైవ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేసుకోవాలని ప్రతి మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి మొదటి, రెండవ డోసు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని 10 నుండి 15 రోజుల్లో డ్రైవ్ నిర్వహించి పూర్తి చేయాలని తెలిపారు. ఇప్పటివరకు 9 లక్షల 70 వేల మందికి వాక్సిన్ ఇవ్వడం జరిగిందని ఎవరికి ఏమి కాలేదని తెలిపారు. వాట్సాప్ లో వ్యాక్సిన్ పై వచ్చే అపోహలు, పుకార్లను నమ్మవద్దని వ్యాక్సిన్ తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా వచ్చినా మందులతో తగ్గుతుందన్నారు. ఓమిక్రాన్ వేరియంట్ థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. గ్రామాలలో సర్పంచులు,
వి డి సి కమిటీలు ముందుకు రావాలని, జి పి సెక్రటరీలు, మున్సిపాలిటీల కమిషనర్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు తప్పనిసరిగా 18 సంవత్సరాలు దాటిన వారికి మొదటి, రెండవ డోసు ఇప్పించాలని తెలిపారు. 31 డిసెంబర్ వరకు 100% పూర్తి కావాలన్నారు. అందుకు కు గ్రామ పంచాయతీలకు నాలుగు, మున్సిపాలిటీలకు వ్యాక్సినేషన్ పూర్తి చేసినందుకు 26 జనవరి రోజు ఫస్ట్, సెకండ్ అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు .

ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, అడిషనల్ కలెక్టర్ LB చిత్రా మిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్, డి ఆర్ డి ఓ చందర్ నాయక్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శివ శంకర్, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post