10 సంవత్సరాలు, 16 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ టీడీ (టెటనస్ డిఫ్తీరియా) వ్యాక్సిన్ వేయించాలి:: జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య.

10 సంవత్సరాలు, 16 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ టీడీ (టెటనస్ డిఫ్తీరియా) వ్యాక్సిన్ వేయించాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సమావేశం కలెక్టర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 7వ తారీకు నుండి 19వ తారీకు వరకు టీడీ (టెటనస్ డిఫ్తీరియా) వ్యాక్సిన్ కార్యక్రమం అన్ని పాఠశాలల్లో చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఐదవ తరగతి, పదవ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థులందరికీ, ఎవరికైతే టీడీ వ్యాక్సిన్ వేయించుకోలేదో వారందరికీ 100 శాతం ఈ వ్యాక్సిన్ వేయించాలని, దానికి లైన్ డిపార్ట్మెంట్ అందరూ సహకరించాలని ఆదేశించారు. అధ్యాపకులు 5వ తరగతి, పదవ తరగతి చదువుతున్న పిల్లలు వ్యాక్సిన్ లబ్ధిదారుల యొక్క లిస్టు తయారు చేయాలని అలాగే గ్రామాలలో 10 సంవత్సరములు ,16 సంవత్సరముల వయసు కలిగిన వారి వివరములు లిస్టు తయారు చేయాలని వారందరికీ టి డి వ్యాక్సిన్బి వేయాలని ఆదేశించారు. అర్హత కలిగిన 10 సంవత్సరములు, 16 సంవత్సరముల వయసు కలిగిన పిల్లలకు వ్యాక్సిన్ సరిపోయేలా చూసుకోవాలని సరైన నిల్వలు ఉండేలా చూసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు.

అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ టీడీ వ్యాక్సిన్ తీసుకోవడం వలన పిల్లలకు టెటనస్ వ్యాధి మరియు డిఫ్తీరియా వ్యాధి రాకుండా పిల్లలు కాపాడబడతారు. టీడీ వ్యాక్సిన్ ఇది 0.5 ml ప్రతి ఒక్క అర్హత కలిగిన వారికి 10 సంవత్సరములు, 16 సంవత్సరముల వారికి ఇవ్వాల్సి ఉంటుందని, వైద్య సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని వారికి సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అన్ని పాఠశాలలను కవర్ చేయాలని, 10 సంవత్సరం, 16 సంవత్సరముల పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్స్ అందేలా చూడాలని తెలిపారు. ఎవరైనా పిల్లలు ఆరు నెలల లోపు టీడీ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే వారికి ఇవ్వకూడదని తెలిపారు. ఇది నవంబర్ 7 వ తారీఖు నుండి 19వ తారీకు వరకు స్పెషల్ డ్రైవ్ గా ఈ క్యాంపెయిన్ కొనసాగుతుందని అర్హత కలిగిన వారు ఉప కేంద్రాలలో కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గాని తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేశారు.

ఈ యొక్క కార్యక్రమానికి లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ సహకరించాలని, ప్రజలు (తల్లిదండ్రులు)సహకరించాలని కోరారు. అనంతరం అసంక్రమిత వ్యాధుల డ్రగ్ కిట్ ఆవిష్కరించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాకు కిట్ట్ బ్యాగులు సప్లై అయినవని, రక్తపోటు మధుమేహము మొదలైన దీర్ఘకాల వ్యాధులకు రోగుల కొరకై వారు ప్రభుత్వం ద్వారా తీసుకున్న మందులను ఈ కిట్ లో భద్రపరుచుకోవాలని తద్వారా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము వేసుకుని మందులు వారికి సులువుగా అర్థమవుతాయని సక్రమంగా వేసుకునేందుకు ఈ కిట్ ఎంతగానో తోడ్పడుతుందని దానివల్ల వారి యొక్క వ్యాధులు నయమైతాయని వారు ఆరోగ్యంగా జీవనం కొనసాగేందుకు తోడ్పడతాయని వారు సూచించారు.

అనంతరము జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ మన జిల్లాలో రక్త పోటు వ్యాధి కలిగిన వారు 8300 మంది ,మధుమేహము వ్యాధి కలిగిన వారు 3011 మంది ఉన్నారని , వారు పరీక్షలు చేసుకోగా తెలుసుకోవడం జరిగిందని వారందరికీ ఇలాంటి కిట్లు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. దీనివల్ల రోగులకు మందులు సక్రమంగా వేసుకోవడం జరుగుతుందని, జబ్బులు త్వరగా నయం అవుతాయని అందరూ వీటిని సక్రమంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వై వి గణేష్ , డిఆర్ఓ రమాదేవి , పానిని జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్, దేశి రామ్ అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్, పి ప్రేమలత బి డబ్ల్యు, పి భాగ్యలక్ష్మి డీఎస్సీ డివో, ఎండి రఫీక్ డిపిఆర్ఓ జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ,డెమో తిరుపతయ్య ,దుర్గారావు, హెచ్ ఈ భాస్కర్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post