100% వాక్సినెటెడ్ గ్రామంగా ప్రకటించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి : రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు, జిల్లా అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

పత్రిక ప్రకటన నల్గొండ
13.11.2021

———————————————-
ప్రతి గ్రామాన్ని నూటికి నూరు శాతం వాక్సినెటెడ్ గ్రామంగా ప్రకటించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర ఆర్ధిక మరియు వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

శనివారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టరులు, వైద్య ఆరోగ్య శాఖఅధికారులు, పంచాయతీ అధికారులతో కోవిడ్ వాక్సినేషన్ పై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దేశములోనే వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు ఉంచేందుకు కలెక్టర్లు, వైద్య అధికారులు, సిబ్బంది కృషి చేయాలనీ మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో మొదటి డోస్, రొండో డోస్ లు వంద శాతం పూర్తి చేయాలని, వాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కోవిడ్ వాక్సిన్ తీసుకునేలా చూడాలని అన్నారు.
జిల్లాలలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పుడు అందుబాటులో ఉండాలని, ఆసుపత్రులలో వైద్య పరికరాలు, మెషినరీ అన్ని సక్రమంగా పని చేసేలా చూడాలని, పని చేయని వాటికీ మరమత్తులు చేపట్టి వినియోగములోకి తీసుకురావాలని సూచించారు. ఆశా వర్కర్ నుంచి సూపరింటెండెంట్ వరకు ప్రతి ఒక్కరు పని చేసే విదంగా కలెక్టరులు పర్యవేక్షించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను. జిల్లా ఆసుపత్రులను ఎప్పుడు కలెక్టరులు తనిఖీ చేసి రోగులకు సరియైన వైద్యం అందిచేలా, వైద్యులు, సిబ్బంది పని చేసేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. వైద్యం కోసం ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే విదంగా ఆసుపత్రులను తీర్చిదిద్దాలని సూచించారు.
అన్ని ఆరోగ్య కేంద్రాలలో వైద్య అధికారులు, సిబ్బంది సమయానికి హాజరు కావాలని, ప్రభుత్వ ఆసుపత్రులను నిరంతరం తనిఖీ చేయాలని, వైద్య సిబ్బంది నియామక అధికారాలను కలెక్టర్లకు ఇచ్చామని హాస్పిటల్లలో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉన్నాయని, ప్రజలకు అవసరమైన సర్జరీలు చేపట్టాలన్నారు. ఔట్ పేషెంట్ ల సంఖ్య పెరగాలని , ప్రభుత్వ ఆసుపత్రులలో శానిటేషన్, మురుగు నీరు, పందుల బెడద వంటివి లేకుండా వైద్య అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లా వైద్య అధికారి జిల్లాలోని ప్రైమరీ హెల్త్ సెంటర్, వారి పరిధిలోని ఆసుపత్రులను క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, ప్రభుత్వ ఆస్పత్రులలో అందించే భోజనాల నాణ్యతను కూడా పరిశీలించాలన్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వైద్యశాల పనితీరుపై రోగులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. మలేరియా, టిబి, లెప్రసి, బ్లైండ్నెస్ వంటి నాలుగు అంశాలపై కలెక్టర్లు, వైద్య అధికారులు, డాక్టర్లు నిరంతరం దృష్టి పెట్టాలన్నారు. త్వరలోనే అన్ని జిల్లాలలో తాను పర్యటిస్తానని సేవలు బాగుంటే అవార్డులు అందిస్తామని తెలిపారు.
అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ జిల్లాలో వందకు వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని, త్వరలో వంద శాతం పూర్తి చేస్తామని,ఆసుపత్రులను తనిఖీ చేసి అన్ని విధాలుగా ప్రజలకు వైద్యం అందిచేందుకు, అన్ని విభాగాల సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు చేపడతామని మంత్రికి తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కొండల్ రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
——————————————–
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ.

Share This Post