100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న మండలంగా స్ఫూర్తిగా నిలవాలి…

ప్రచురణార్థం

100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న మండలంగా స్ఫూర్తిగా నిలవాలి…

మహబూబాబాద్, సెప్టెంబర్ 23.

వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న మండలంగా గంగారం నిలవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం గంగారం మండలం కోమట్ల గూడెం, గంగారం ప్రాధమిక ఆరోగ్య వైద్య కేంద్రాలను వ్యాక్సినేషన్ సెంటర్లను కలెక్టర్ సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు.

హాస్పిటల్స్ ఆవరణ లలో గడ్డి మొలవడం చెత్తతో ఉండటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్పిటల్ పరిశుభ్రంగా ఉంచాలన్నారు ఆవరణం మొత్తం చెత్త తో నిండి ఉండటంతో విష పురుగులు సంచరించే ప్రమాదముందని వెంటనే పరిశుభ్రం చేయించి మొక్కలు నాటాలని వైద్యాధికారులను ఆదేశించారు.

కోమట్ల గూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమంను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. వ్యాక్సిన్ వేసుకునే వారితో మాట్లాడారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు చేసిన జాప్యంపై అడిగి తెలుసుకున్నారు.

రెండు రోజుల్లో వంద శాతం వ్యాక్సినేటెడ్ గా ప్రకటించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

తిరుమల గండి లో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించి 100% పూర్తి చేసినందున ఏఎన్ఎం నాగలక్ష్మి శ్రీలత సుంచు సుజాత వైద్య సిబ్బందిని అభినందిస్తూ వారితో పాటుగా ప్రజా ప్రతినిధులను కలెక్టర్ శాలువా కప్పి సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.

తదనంతరం గంగారం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు వీడియో కాన్ఫరెన్స్ కు కావలసిన పరికరాలను ఏర్పాటు చేయించాలని గిరిజన సంక్షేమ అధికారి ని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు దిలీప్ కుమార్ జెడ్ పి టి సి ఈసం రమ ,ఎంపీపీ సువర్ణ పాక సరోజన, వైస్ ఎంపీపీ ముడిగ వీరభద్ర, సర్పంచ్ దుగ్గల సుగుణ వైద్య ఆరోగ్య శాఖ అధికారి హరీష్ రాజు, ఉప వైద్యాధికారి అంబరీష, కోమట్ల గూడెం గంగారం వైద్యాధికారులు ఆఫ్రోజ్, ముక్రరం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post