100 శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలి

ప్రచురణార్ధం

100 శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలి

మహబూబాబాద్, 2021 డిసెంబర్ – 02:

వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేయలని జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం జిల్లా కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి వెంటనే వంద శాతం పూర్తి చేయాలని తెలిపారు. ఎక్కడైతే తక్కువగా నమోదు అవ్వడం జరిగిందో ఆ PHC లలోని మెడికల్ అధికారులతో ఎంపిడిఓ లు సమన్వయం చేసుకొని లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు.

మండలాల వారీగా వాక్సినేషన్, హరిత హారం, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

తొర్రూరు, ఇనగుర్తి, కురవి, డోర్నకల్, నెళ్ళికుదురు PHC లలో తక్కువగా వాక్సినేషన్ అయిందని, వెంటనే పూర్తి చేయలని తెలిపారు.

ఓటరు జాబితా ప్రకారం అందరూ వాక్సినేషన్ వేయించుకుని ఉండాలని, తక్కువగా నమోదు అయిన పక్షంలో చర్యలు తప్పవని సూచించారు. మొదటి డోస్ తీసుకొని రెండవ డోస్ తీసుకోకుండా వున్న వారి వివరాలను కోవిన్ వెబ్ సైట్ లో ఆధార్ ప్రకారం పరిశీలించి రెండవ డోస్ తీసుకునే విధంగా చూడాలని తెలిపారు.

అనంతరం హరితహారం పై సమీక్షించారు. హరితాహారం నర్సరీ లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మొక్కలకు వాటరింగ్ చేయాలని, నెలవారీగా సమీక్షలో హరిత హారం గ్రామ పంచాయితీల వారీగా సమీక్షించడం జరుగుతుంది. ప్రతి నెల పెర్ఫార్మెన్ రిపోర్ట్ లో ప్రగతి ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, zp-ceo, DMHO, APD, ఎంపిడిఓ లు,
ప్రోగ్రామ్ అధికారులు, మెడికల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post