సకల వర్గాల ఐకమత్యంతో నవ సమాజ నిర్మాణం…. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ

సకల వర్గాల ఐకమత్యంతో నవ సమాజ నిర్మాణం…. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం

సకల వర్గాల ఐకమత్యంతో నవ సమాజ నిర్మాణం…. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ

ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిరళ కృషి చేసిన అలుపెరగని పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మంత్రి పదవి రాజీనామా చేసిన త్యాగశీలి

అట్టహాసంగా జరిగిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు

పెద్దపల్లి, సెప్టెంబర్ -27:

సకల వర్గాల ఐకమత్యంతో పని చేయడం ద్వారా నవ సమాజ నిర్మాణం జరుగుతుందని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు.

మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిరళ కృషి చేసిన అలుపెరగని పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితకాలంలో అనేక పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేశారని కొనియాడారు.

తెలంగాణ కొరకు మంత్రి పదవిని సైతం 1969 ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని,అటువంటి మహనీయుల త్యాగాల ఫలితాలు నేటి తరానికి బంగారు బాటలు వేశాయి అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని, చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షించారని అదనపు కలెక్టర్ తెలిపారు.

తెలంగాణ ఏర్పాటులో కొండా లక్ష్మణ్ బాపూజీ కృషిని గుర్తించి ప్రభుత్వం ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టిందని, అధికారికంగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నదని అదనపు కలెక్టర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు, స్వాతంత్ర్య పోరాటంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో బాపూజీ పాల్గొన్నారని, సమాజంలో అన్యాయాలకు గురవుతున్న అట్టడుగు వర్గాల తరపున న్యాయస్థానాల్లో పోరాడి ఉచిత న్యాయ సేవలు అందించారని అదనపు కలెక్టర్ తెలిపారు. సాయుధ రైతు పోరాటానికి స్పూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మకు కొండా లక్ష్మణ్ బాపూజీ ఉచిత న్యాయ సేవలు అందించారని తెలిపారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మహనీయులు ఒక కులానికి చెందినవారు కారని, దేశానికి ఆదర్శ వంతమైన జీవనం గడిపారని అన్నారు.

మన చేతి 5 వేళ్ళు కలిస్తేనే మనం పనులు చేయడానికి వీలైనట్లు సమాజంలోని అన్ని వర్గాల వారు ఐక్యమత్యంతో ఉంటే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు యువతరం కట్టుబడి, మహనీయులు చేసిన సేవలను స్మరించుకుంటూ సన్మార్గంలో నడుస్తూ భావితరాలకు స్ఫూర్తి నివ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిరంతరం శ్రమించిన మహనీయులు జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ సామాజిక అభ్యున్నతి కొరకు కృషి చేసిన మహనీయుడని, ఆనాటి పరిస్థితుల్లోనూ ఎదుర్కొని విద్య పై శ్రద్ధ వహించి న్యాయవాదిగా పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించారని అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ పట్ల జరుగుతున్న వివక్షను గుర్తించి 1969లో రాజీనామా చేశారని, దశ ఉద్యమానికి నాంది పలికిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిష్కరణ జల దృశ్యానికి సొంత ఇంటిని వేదిక చేశారని ఎమ్మెల్యే తెలిపారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితంలో సమాజ శ్రేయస్సు కోసం అనేక త్యాగాలు చేశారని, ఆ స్ఫూర్తి మనమంతా తీసుకొని ముందుకు సాగాలని, ఆయన కీర్తిని , చేసిన పనులను ప్రజలలోకి విస్తృతంగా తీసుకొని వెళ్లాలని ఎమ్మెల్యే అన్నారు.

శ్రీ వెంకటేశ్వర చేనేత సహకార సంఘం కనుకులకు చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక అవార్డు గ్రహీతలను మిట్టపెల్లి లక్ష్మయ్య, అడేపు రాజేశం ముఖ్య అతిథులను సన్మానించారు. అంతకు ముందు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని జడ్పిటిసిలు, పద్మశాలి సంఘ ప్రతినిధులు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ఓదెల జెడ్పీటీసీ గంటా రాములు, జూలపల్లి జెడ్పీటీసీ లక్ష్మణ్, పెద్దపల్లి జెడ్పిటిసి బండారి రామ్మూర్తి,పెద్దపల్లి ఎంపిపి స్రవంతి,పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు వేముల రామ్మూర్తి, మాజీ మత్య శాఖా చైర్మన్ చేతి ధర్మయ్య, ఇతర ప్రజా ప్రతినిధులు, వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రంగా రెడ్డి, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, డి.సి. ఓ. మైకేల్ బోస్, వ్యవసాయ శాఖ అధికారి ఆది రెడ్డి, టి.ఎన్.జి. ఓ. అధ్యక్షులు బొంకూరి శంకర్,
పద్మశాలి, బి.సి. కుల భాందావులు,కుల సంఘాల ప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

Share This Post