తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పండుగ బతకమ్మ

అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

000000

   ఆనందాలను, ఆప్యాయతలను పంచడమే కాకుండా విలువలకు అద్దం పడుతుంది బతకమ్మ పండగ అని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు.

బుధవారం రాత్రి జ్యోతిబా పూలే( సర్కస్ గ్రౌండ్)లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష బతకమ్మలో ఆమె పాల్గొన్నారు. జడ్పి సిఈఓ డిఆర్డిఓ ,డిఎమ్ హెచ్ఓ,డిడబ్ల్యుఓ లతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నా,పెద్దా తేడా లేకుండా అత్యంత వైభవోపేతంగా జరుపుకునే పండగ బతకమ్మ అన్నారు. ఆనందాలను, ఆప్యాయతలను పంచడమే కాకుండా విలువలకు బతకమ్మ అద్దం పడుతుందని అన్నారు.

  వివిధ మండలాలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున బతుకమ్మలతో వేలాది మంది మహిళలు స్వశక్తి కాలేజీ నుండి జ్యోతి బాపూలే మైదానం వరకు తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జూవేరియా, జిల్లా సంక్షేమ అధికారి కే. సబితా, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, అదనపు డి ఆర్ డి ఓ సంధ్యారాణి, జిల్లా సమైక్య ప్రెసిడెంట్ కే. హరిణి, మహిళా స్వశక్తి సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post