దళిత బంధు తో ఎస్సీ జీవితాల్లో వెలుగు -రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బి. శ్రీనివాస్

దళిత బంధు తో ఎస్సీ జీవితాల్లో వెలుగు -రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బి. శ్రీనివాస్

ప్రచురణార్థం

దళిత బంధు తో ఎస్సీ జీవితాల్లో వెలుగు -రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బి. శ్రీనివాస్

గతంలో ఫోటోగ్రాఫీ వర్కర్, నేడు ఓనర్

నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం పై హర్షం

దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ కు కృషి చేసిన ఈడి ఎస్సీ కార్పొరేషన్ అభినందనలు

గోదావరిఖని, రామగుండంలో పర్యటించి దళిత బంధు లబ్ధిదారులను కలిసిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్

గోదావరిఖని, రామగుండం,
సెప్టెంబర్ -29:

దళిత బందు పథకం అమలు ద్వారా సీఎం కేసీఆర్ పేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బి. శ్రీనివాస్ అన్నారు.

గురువారం గోదావరిఖని, రామగుండం ప్రాంతాలలో పర్యటించిన చైర్మన్ దళిత బంధు లబ్ధిదారులను కలుసుకున్నారు. గోదావరిఖనిలో అడ్డగుంటపల్లి లోని సిరి ఫంక్షన్ హాల్ లో నూతన ఆసరా లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను రామ గుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ తో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో 200 అందించే పెన్షన్ ను సీఎం కేసీఆర్ 2016/- కు పెంచి అర్హులందరికీ మంజూరు చేశారని, పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ నెంబర్ 46, 36, 32, 43, 45, 44 లో 672 నూతన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు.

రామగుండం ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన ప్రశంసించారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసిఆర్ కిట్, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జీవితాల్లో వెలుగులను నింపుతున్న సీఎం కేసీఆర్ కు అందరం అండగా నిలబడాలని ఆయన అన్నారు.

రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనానికి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ గా నామకరణం చేసినందుకు సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలో దళిత బంధు పథకం ప్రక్రియను వేగవంతం చేసి యూనిట్లను సరైన సమయంలో అందించినందుకు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధుసుధన శర్మ ను, సిబ్బందిని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బి. శ్రీనివాస్ అభినందించారు.

కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ మాట్లాడుతూ, వృద్ధులు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్ 200 పెన్షన్ ను 2016/- కు పెంచారని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఆసరా పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేసే ఏ రాష్ట్రంలో ను సగం కూడా పెన్షన్లు అందించడం లేదని ఎమ్మెల్యే అన్నారు.

రామగుండం ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఈ ప్రాంత ప్రజలకు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా చిరకాల ఆకాంక్ష వైద్య కళాశాల ఏర్పాటును సాధించానని, 330 పడకల ఆసుపత్రి, 160 నర్సులు, 60 వైద్యులతో ఆధునిక వైద్య కళాశాల రామగుండంలో ఏర్పాటవుతుందని ఎమ్మెల్యే తెలిపారు

పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా వైద్య కళాశాలలో అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

అనంతరం గోదావరిఖనిలోని ఎల్బీనగర్ స్టేడియం సమీపంలో దళిత బంధు లబ్ధిదారుడు కోడి రామకృష్ణ ఫోటోగ్రఫీ స్టూడియోను, ట్రాక్టర్ లబ్ధిదారుడు కొర్రి ఓదెలు ఇద్దరు లబ్ధిదారుల యూనిట్లను పరిశీలించి లబ్ధిదారులను శాలువాతో చైర్మన్ సన్మానించారు.

పెద్దపల్లి జిల్లాలో దళిత బంధు పథకం ప్రక్రియను వేగవంతం చేసి యూనిట్లను సరైన *సమయంలో అందించినందుకు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధుసుధన శర్మ ను, సిబ్బందిని చైర్మన్ అభినందించారు.

అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలవుతుందని, దళిత బందు ద్వారా జీవితాలలో వెలుగులు నిండుతున్నాయని, గతంలో ఫోటొగ్రాఫీ వర్కర్ గా పని చేస్తూ 5 నుంచి 6 వేలు సంపాదించే వారు నేడు ఓనర్ లుగా మారి నెలకు దాదాపు 25 నుంచి 30 వేలు సంపాదిస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, అంతర్గాం జెడ్పీటీసీ నారాయణ, స్థానిక కార్పొరేటర్ లు,సిబ్బంది ఏ.ఈ. ఓ.రాజు,సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

Share This Post