సోమవారం ఆసరా పథకం కింద ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య శ్రీ డయాలసిస్ రోగులైన ముగ్గురికి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు తన ఛాంబర్లో ఆసరా పింఛను గుర్తింపు కార్డులను అందజేశారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి బారినపడి డయాలసిస్ చేయించుకోవడానికి బాధితులు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొనకుండా వారికి ఆసరా పింఛను గుర్తింపు కార్డులను అందచేసి ప్రభుత్వం అండగా నిలబడుతున్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశ్రీ సీఈఓ విశాలాచి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేట్ ర్ డాక్టర్ పవన్ కుమార్, లబ్ధిదారులు పి. మనీషా, బి. మాలతి, ఎ. ఉమాకాంత్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Share This Post