పత్రికా ప్రకటన. తేది:11.05.2022, వనపర్తి.
ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నదని, రైతులు అవగాహన పొంది లాభదాయకమైన పంటలను సాగు చేయాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ రాజేందర్ రెడ్డి సూచించారు.
బుధవారం మదనపూర్ మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తలు, ప్రియూనిక్ FGV కంపెనీ GM సహకారంతో వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలోని మైక్రో ఇరిగేషన్ కంపెనీ సమన్వయకర్తలు, డి.సి. ఓ.లు, ఇంజనీర్స్ కంపెనీలు, డీలర్లలకు “ఉద్యాన పంటలు నాటుకునే సమయంలో తీసుకోవాల్సిన యాజమాన్యం పద్ధతులు” పై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల తోటలు, ఆయిల్ పామ్ సాగుకు నేల తయారీ, మార్కింగ్ లే అవుట్ ఇచ్చే విధానం ప్రాక్టికల్ గా మార్కింగ్ చేసి ఆయన వివరించారు. వివిధ రకాల పండ్ల తోటలకు డ్రిప్ ఏర్పాటు విధి విధానాలు, ఆయిల్ పామ్ సాగుకు కేవలం చతురస్రాకార విధానం మాత్రమే మన రాష్ట్రానికి అనుమతినిచ్చారని ఆయన అన్నారు. ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన డ్రిప్ సౌకర్యాన్ని పూర్తి అవగాహన ఉన్న ఇంజినీర్లు మాత్రమే సర్వే చేసి డిజైన్ తయారు చేసిన వెంటనే రైతుకు ఎస్. ఎం.ఎస్. ద్వారా తెలియజేయాలని ఆయన తెలిపారు.
జిల్లా ఉద్యాన శాఖ అధికారి డా.సురేష్ కుమార్ మాట్లాడుతూ ఉద్యాన పంటలకు ఏ విధమైన భూములు అనువైనవి, ఎంత మోతాదులో గుంతలు తీయాలి, ఏ సాంద్రతతో నాటాలి, ఏ మొక్కలు నాటాలి, మామిడిలో అంటూ మొక్కలు, బత్తాయిలో రoగపూర్ మొక్కల మీద అంటూ గట్టినవి సాగు చేయాలని ఆయన తెలిపారు.
ప్రియునిక్ FGV GM రామోహన్ రావు మాట్లాడుతూ ఆయిల్ పామ్ మొక్కలు 12 నెలలు పెంచినవి, 12 ఆకులు కలిగినవి, 1మీటర్ ఎత్తు పెరిగినవి, నాణ్యమైనవి, రైతులకు జూన్ మొదటి వారంలో మొదట వచ్చిన రైతుకు మొదటి ప్రాధాన్యత క్రమంలో అందజేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో గద్వాల్ ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ సిబ్బంది, వివిధ కంపెనీల సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.