పత్రికా ప్రకటన. తేది:11.05.2022, వనపర్తి.
ఎస్.సి. అభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ – పాస్ వెబ్ సైట్ ద్వారా ఉపకార వేతనం కొరకు ఈ నెల తేది:11.05.2022 నుండి 21.05.2022 వరకు దరఖాస్తు చేసుకొనుటకు గడువు పెంచినట్లు, ఇంతవరకు దరఖాస్తు చేసుకోని వారు, రెన్యువల్ చేసుకోవలసిన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయుటకు అవకాశం కల్పించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి నుశిత ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆమె సూచించారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.