నల్గొండ,ఆగస్ట్ 11.భవన నిర్మాణ అనుమతులు,లే అవుట్ అనుమతులు నిర్ణీత సమయం లో, పారదర్శకంగా,త్వరితంగా అనుమతులు మంజూరు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టి. ఎస్.బి పాస్ చట్టం అమలు లోకి తీసుకు వచ్చిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.అక్రమ కట్టడాలు, లే అవుట్ ల ను గుర్తించి మున్సిపాలిటీ వారీగా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఎన్ఫోర్స్ మెంట్,టాస్క్ ఫోర్స్ టీమ్ లు నిబంధనల మేరకు చర్యలు,కూల్చి వేయాలని కలెక్టర్ ఆదేశించారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,డి.ఐ. జి.ఏ.వి.రంగ నాథ్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి మున్సిపల్ కమిషనర్ లు,ఆర్.డి.ఓ.లు,అగ్నిమాపక శాఖ,డి.ఎస్.పి.లు, జిల్లా టాస్క్ పోర్స్ కమిటీ మున్సిపాలిటీ ఎన్ ఫోర్స్ మెంట్ బృందాల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ వారీగా ఆర్.డి.ఓ.,డి.ఎస్.పి
,అగ్నిమాపక,ఆర్&బి,టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులతో ఎన్ ఫోర్స్ మెంట్,(డెమోలిషన్) బృందాలు ఏర్పాటు చేసినట్లు, ఈ బృందాలు మున్సిపల్ కమిషనర్ ల సమన్వయం,సహకారం తో తనిఖీ లు నిర్వహించి టి. ఎస్.బి పాస్ ద్వారా అనుమతులు పొంది నిబంధనలు ఉల్లంఘించిన భవన నిర్మాణాలు, అక్రమ భవన నిర్మాణాలు, లే అవుట్ లు నిబంధనల మేరకు కూల్చి వేసి చర్యలు తీసుకోవాలని అన్నారు.జిల్లా స్థాయి టాస్క్ పోర్స్ కమిటీ అక్రమ కట్టడాల పై మాన్యువల్ గా,టి.ఎస్.బి.పాస్ పోర్టల్,కాల్ సెంటర్,మొబైల్ అప్లికేషన్, ట్విట్టర్ ద్వారా వచ్జిన ఫిర్యాదులు స్వీకరించి 3 రోజుల్లో ఫిర్యాదులు పరిశీలించి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి అవసరమైతే డెమాలిషన్ స్క్వాడ్ నోటీస్ లేకుండా కూల్చి వేస్తుందని అన్నారు.జిల్లా టాస్క్ పోర్క్స్ కమిటీ మున్సిపాలిటీ వారీగా అక్రమ భవన నిర్మాణాలు,కట్టడాలు,లే అవుట్ లపై,ఫిర్యాదుల పై సమాచారం సేకరణ చేస్తుందని అన్నారు.అక్రమ భవనాలు,కట్టడాలు,నిర్మాణాలు కూల్చి వేసెప్పడు నిర్మాణ దశలు,అనుమతులు,నిబంధనల ఉల్లంఘన ఫోటో, వీడియోగ్రఫీ ద్వారా రికార్డ్ చేస్తూ, పంచనామా నిర్వహిస్తుందని అన్నారు.పంచనామా కాపీ ని భవన నిర్మాణ యజమానికి అందచేస్తుందని అన్నారు.అక్రమ కట్టడాలు,లే అవుట్ లపై రిజిస్ట్రేషన్ అథారిటీ కు సమాచారం అందిస్తూ నిషేధ ప్రాపర్టీ రిజిస్టర్ లో నమోదు చేస్తూ, త్రాగు నీరు సరఫరా,విద్యుత్ సరఫరా కనెక్షన్ లు ఇవ్వకుండా సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేస్తుందని అన్నారు.జిల్లా టాస్క్ ఫోర్స్ 15 రోజుల కొకసారి సమావేశం జరిపి సమీక్ష నిర్వహిస్తుందని అన్నారు.
