తెల౦గాణ రాష్ర్ట ప్రభుత్వం
( జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం – హనుమకొండ )
పత్రిక ప్రచురణార్ధం
తేదీ: 02/12/2022
లెప్రసీ కేస్ డిటెక్షన్ సర్వేలెన్సు ప్రోగ్రాం లో భాగంగా జిల్లాలోని వైద్యాధికారులకు మరియు సంబంధిత శాఖల అధికారులతో జిల్లా సమన్వయ సమావేశం ( డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ) హనుమకొండ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వరంగల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి శ్రీ జె.ఉపేందర్ రావు గారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ లెప్రసీ ఎనిమినేషన్ లో అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ లెప్రసీ వ్యాధిని నిర్మూలించాల్సిన ఆవశ్యతను ఆయన పేర్కొన్నారు అదేవిధంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున లెప్రసీ ప్రోగ్రాంపై త్వరలో ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు మాట్లాడుతూ లెప్రసీ కేస్ డిటెక్షన్ సర్వేలెన్సు కార్యక్రమము డిసెంబర్ 6 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు నిర్వహించబడుతుందని కావున వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న క్షేత్ర సాయి సిబ్బంది ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు ఈ సర్వే కార్యక్రమాన్ని చేపట్టాలని అనుమానిత కేసులను దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారికి పంపించవలసి ఉంటుందని అంతేకాకుండా మిగతా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు భంగం వాటిల్లకుండా ఈ యొక్క సర్వేలెన్సును పూర్తి చేయవలసి ఉంటుందని ఆయన తెలిపారు.
ముందుగా జిల్లా లెప్రసీ అండ్ ఎయిడ్స్ అడిషనల్ డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు జిల్లాలోని లెప్రసీ వ్యాధి యొక్క గణాంకాలను మరియు వ్యాధి నిర్మూలనలో తీసుకోవలసిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైద్యాధికారులకు శిక్షణ నిర్వహించడం జరిగింది.
ఎంజీఎం హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంజీఎం హాస్పిటల్ లో కుష్టు వ్యాధిగ్రస్తులకు అవసరమైతే వారికి ప్రత్యేకమైన వార్డు కేటాయించ బడినట్లు తెలిపారు. కాకతీయ మెడికల్ కాలేజ్ సమాజ వైద్యశాస్త్ర ప్రొఫెసర్ మరియు వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి పూనం కుమారిజా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సిబ్బంది పనిచేస్తున్నప్పుడు లెప్రసీ వ్యాధిపై అవగాహన కల్పించాలని లెప్రసీ వ్యాధిగ్రస్తులకు వేడి, శీతల స్థితిగతులను గుర్తించలేరు కాబట్టి వారిని వేడి ప్రదేశాలకు దూరంగా ఉండేటట్లు అవగాహన కల్పించాలని అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ రోజు రాత్రి సమయంలో లెప్రసీ వ్యాధి వలన ఏర్పడిన పుండ్లు మొదలగు వాటిపై సబ్బుతో శుభ్రముపరచుకొని లేపనం పూసు కోవాలని తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో డిఆర్ డిఏ శ్రీనివాస్, ఆయుష్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్. రవి నాయక్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ బాలాజీ, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ యాకుబ్ పాషా, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాశ్రీ, జిల్లా ఇమ్యు నైజేషన్ అధికారి డాక్టర్ గీతాలక్ష్మి, డిస్టిక్ సర్వేలను ఆఫీసర్ డాక్టర్ వాణిశ్రీ, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మరియు అర్బన్ హెల్త్ సెంటర్ల, వైద్యాధికారులు, ఆర్బీఎస్కే వైద్యాధికారులు, సూపర్వైజర్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబందాల శాఖాధికారి గారి ద్వారా అన్ని పత్రికలలో ప్రచురణ నిమిత్తం సమర్పించనైనది.