డబుల్ బెడ్ రూం ఇళ్లలో మౌళిక వసతులు కల్పించి లబ్దిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలి ….జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

*కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండల కేంద్రాల్లో డబుల్ బెడ్ రూం పనుల పురోగతి పరిశీలన

*కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మన ఊరు మన బడి క్రింద చేపట్టిన పనులను, పెయింటింగ్ పనులను పరిశీలన

—————————————
కాల్వ శ్రీరాంపూర్, ఓదెల,
పెద్దపల్లి జిల్లా, డిసెంబర్ -07:
—————————————

డబుల్ బెడ్ రూం ఇళ్లలో అన్ని మౌలిక వసతులు కల్పించి లబ్దిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంభందిత అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ వి.లక్ష్మీ నారాయణ తో కలిసి కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలంలోని డబుల్ బెడ్ రూం పనులను, మన ఊరు మన బడి పాఠశాలలలో జరుగుతున్న పనులను పరిశీలించారు.

ముందుగా జిల్లా కలెక్టర్ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పర్యటించి డబుల్ బెడ్ రూం నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 240 గృహాలకు మొత్తం పూర్తి కాగా, పూర్తి అయిన ఇళ్లలో లబ్దిదారులకు ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు కల్పించాలని, మౌళిక వసతులు అయిన విద్యుత్, ఇంటర్నల్ రోడ్ సౌకర్యం, డ్రైనేజ్, నీటి సౌకర్యంవసతులను కల్పించాలని, ఇళ్లకు సింటెక్స్ టాంక్, సముదాయానికి సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసి సంక్రాంతి లోగా మొత్తం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే విధంగా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జెడ్.పి.హెచ్.ఎస్. పాఠశాలలో మన ఊరు మన కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. పెయింటింగ్ పనులు పరిశీలిస్తూ, బడికి వచ్చే పిల్లలను ఆకట్టుకునే విధంగా పెయింటింగ్ పనులు ఆకర్షణీయంగా, నాణ్యతగా ఉండాలని సూచించారు.

అనంతరం ఓదెల మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. మొత్తం 144 డబుల్ బెడ్ రూం ఇళ్లులు మంజూరు కాగా ఇప్పటి వరకు 48 పూర్తి అయినాయని, మిగతావి పురోగతిలో ఉన్నాయని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పనులను వేగవంతంగా, నాణ్యత తో త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, పూర్తి పర్యవేక్షణ చేస్తూ, త్వరగా ఇళ్ళులు పూర్తి అయ్యే విధంగా చూడాలని సంభందిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఈ ఈ అర్.అండ్ బి – నరసింహా చారీ, డి.ఈ. రాములు, కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ అనుపమ రావు, ఓదెల తహశీల్దార్ రమేష్, ఎక్జిక్యూటివ్ ఏజెన్సీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

ప్రచరణార్థం

Share This Post