12-08-2021*నకిరేకల్,శాలి గౌరారం,నార్కట్ పల్లి, నల్గొండ మండలం లలో అవెన్యూ ప్లాంటేషన్,పల్లె ప్రకృతి వనం లు పరిశీలించిన జిల్లా కలెక్టర్* # మొక్కలు చని పోకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలి

నకిరేకల్,శాలి గౌరారం,నార్కట్ పల్లి,నల్గొండ,ఆగస్ట్ 12.హరిత హరం, పల్లె ప్రగతి లో భాగంగా వివిధ జి.పి.ల పరిధి లో రహదారులపై,పల్లె ప్రకృతి వనం లలో నాటిన మొక్కలు ఎండి పోకుండా మొక్క పెరగటానికి సంరక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,జిల్లా పంచాయతి అధికారి విష్ణు వర్ధన్ తో కలిసి నకిరేకల్, శాలి గౌరారం,నార్కట్ పల్లి,నల్గొండ మండలం లో వివిధ జి.పి.లలో పర్యటించి అవెన్యూ ప్లాంటేషన్,బృహత్ పల్లె ప్రకృతి వనం లు పరిశీలించారు. నకిరేకల్ మండలం చందం పల్లి జి.పి.క్రాసింగ్ ప్లై ఓవర్ పక్కన ఖాళీ గా ఉన్న స్థలం లో మొక్కలు నాటాలని,పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. చందం పల్లి,నెల్లి బండ జి.పి.ల రహదారి వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించి మొక్కలు ఎండి పోకుండా వాటరింగ్ చేయాలని,ప్రతి వారం రెండు సార్లు అధికారులు పర్యటించి మొక్కల సంరక్షణ పర్యవేక్షించాలని అన్నారు.కడపర్తి జి. పి. రహదారి వెంట మొక్కలు పరిశీలించి మొక్కలకు ఎరువు పట్టించాలని సూచించారు.కడపర్తి జి.పి.లో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనం సందర్శించి మొక్కలను పరిశీలించారు. బృహత్ పల్లె ప్రకృతి వనం లో 10 వేల మొక్కలు నాటగా,ఇంకా 5 వేల మొక్కలు నాటాలని,నేమ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని,వాటర్ సమస్య లేకుండా బోర్,విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మండల అధికారులకు సూచించారు.
శాలి గౌరారం మండలం పెర్కకొండారం,మాధవరం(కలాన్) ,వంగ మర్తి జి.పి.లలో అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించారు.మొక్కలు చుట్టూ పెరిగిన పిచ్జి మొక్కలు తొలగొంచి పాదులు చేసి,మొక్కలు వంగిన చోట సపోర్ట్ గా కర్ర ఏర్పాటు చేయాలని,మొక్కలకు ఎరువు వేయాలని,అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు.
నార్కట్ పల్లి మండలం  జి.పి.నుండి.నల్గొండ వచ్చే రహదారి, ఎల్లారెడ్డి గూడ జి.పి.రహదారి వెంబడి  మొక్కలు పరిశీలించి మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలు తొలగించాలని,పెద్ద చెట్లకు వైట్ పెయింట్ వేయాలని సూచించారు.
ఎం.జి.యూనివర్సిటీ ఎదురుగా, అనె పర్తి జి..పి.పరిధి లో ప్రధాన రహదారి ఇరువైపులా,నల్గొండ మండలం చర్ల పల్లి రహదారి వెంట మొక్కలు పరిశీలించి అధికారులకు సూచన లు చేశారు.జిల్లా కలెక్టర్ వెంట మండల,గ్రామ అధికారులు,సర్పంచ్ లు ఉన్నారు.

Share This Post