పత్రికా ప్రకటన తేది:27.01.2023, వనపర్తి.

18 సం.లు పూర్తైన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం కొత్తకోట మండలంలోని నిర్వేన, పాలెం గ్రామ పంచాయతీలలో నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సం.లు పూర్తైన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునే విధంగా గ్రామ, పట్టణ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు అవగాహన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. పౌష్టికాహార లోపం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గుర్తించిన ప్రభుత్వం కంటి సమస్యలు పరిష్కరించేందుకు “కంటి వెలుగు” కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు కంటి పరీక్ష కేంద్రానికి వెళ్ళి కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కంటి వెలుగు కార్యక్రమానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
కంటి పరీక్షలు నిర్వహించిన వెంటనే కంటి అద్దాలను ఉచితంగా అందించటం జరుగుతుందని ఆయన సూచించారు. అవసరమైన వారికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను అందించటం జరుగుతుందని ఆయన తెలిపారు. విటమిన్ లోపం వున్న వారిని గుర్తించి వారికి మందులను అందచేయటం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.
అనంతరం నిర్వెన్ గ్రామ పంచాయతీలోని మాంబ్ మోడల్ పాఠశాలను, పాలెం గ్రామ పంచాయతీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని ఎ. ఈ.కి, కాంట్రాక్టర్లకు ఆయన ఆదేశించారు.
అనంతరం నిర్వెన, పాలెం గ్రామ పంచాయతీలలో అవెన్యూ ప్లాంటేషన్ ను ఆయన తనిఖీ చేశారు. మొక్కలను ప్రతిరోజూ నీరు అందించాలని ఆయన సూచించారు. నిర్వెన, పాలెం గ్రామాలలో పాఠశాలలోని రికార్డులను ఆయన తనిఖీ చేశారు.

అదనపు కలెక్టర్ వెంట అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post