(13.08.2022) 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడం ర్యాలీ : జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
13.8. 2022
వనపర్తి.

ఫ్రీడం ర్యాలీలో పాల్గొని దేశ సమైక్యతకు పాటుపడిన ప్రతి ఒక్కరికి జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి ధన్యవాదములు తెలిపారు. శనివారం 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్రీడం ర్యాలీ డి. యస్. పి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ జండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానము నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితం వల్ల ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామని ప్రతి ఒక్కరు జాతీయ నాయకులను స్మరించుకోవాలని అన్నారు. పట్టణంలో ర్యాలీని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదములు తెలిపారు.

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ భావితరాల వారికి గుర్తుండిపోయే విధంగా 75వ భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈనెల 8 నుండి 22 వరకు జరిగే ఉత్సవాలలో వివిధ రూపాలలో కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలని అన్నారు. 16న ఉదయం పదకొండున్నర గంటలకు సామూహికంగా ఎక్కడికక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ ఈనెల 8 నుండి 22 వరకు జరుగుతున్న స్వాతంత్ర వజ్రోత్సవాలను ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మాట్లాడుతూ వనపర్తి మున్సిపల్ పరిధిలో ప్రతి ఇంటికి జండా అందజేసినట్లు తెలిపారు. ఈనెల 16న సామూహికంగా జాతీయగీతం ఆలపించాలని అందరిని కోరారు. డి.ఎస్.పి ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 8 నుండి 22 వరకు జరిగిన కార్యక్రమాలలో పోలీసు శాఖ క్రియాశీలకంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. అనంతరం గాల్లోకి వదిలిన త్రివర్ణ రంగూల బెలూన్.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి, కౌన్సిలర్లు, విద్యార్థినీ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు,యువకులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
… జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తిచే జారీ చేయబడినది.

Share This Post