13-11-2021 వీడియో కాన్ఫరెన్సు కలెక్టర్

ప్రభుత్వ ఆస్పత్రులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జిల్లా కలెక్టర్లు ఆకస్మికంగా తనిఖీ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లు, వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తిచేసి భారతదేశంలో ప్రథమ స్థానం ఉండేవిధంగా వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్లు కృషిచేయాలని కోరారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏరియా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యశాల పై విశ్వాసం పెరిగే విధంగా వైద్య అధికారులు పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారని చెప్పారు. జిల్లాల వైద్య అధికారి పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయాల్సిన బాధ్యత కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. తాను కూడా ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని తెలిపారు. రోగులకు పౌష్టికాహారం అందించే విధంగా చూడాలన్నారు. ఆస్పత్రిలోని మరుగుదొడ్లు, పరిసరాలు శుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేషన్ ను గ్రామాల్లో వంద శాతం పూర్తి చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. చెక్ పోస్టుల, బస్టాండ్ల, వీక్లీ మార్కెట్ల వద్ద ఆరోగ్య కార్యకర్తలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేయిస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు, గ్రామ సంఘాల మహిళలు వ్యాక్సినేషన్ చేయించుకొని వారిని గుర్తించి వారు వ్యాక్సినేషన్ వేసుకునే విధంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య అధికారిని కల్పన కంటే, ఇంచార్జి జిల్లా పంచాయతీ అధికారి రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ లు శోభారాణి, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ______ జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది

Share This Post