13-11-2021 హాస్టల్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి పట్టణంలోని గిరిజన బాలుర వసతిగృహం ను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. వసతి గృహం లోని మరుగుదొడ్లను పరిశీలించారు. కొన్ని గదులు శిథిలావస్థకు చేరడంతో వాటికి మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. కిటికీలకు జాలీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ పాల్గొన్నారు. ______ జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Share This Post