DPRO KMNR తేది: 14-09-2021 : ఫొటోలు & ప్రెస్ నోట్ : దళిత బంధు స్పెషల్ అధికారులు మరియు క్లస్టర్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జెడ్ పి సీఈఓ ప్రియాంక. (కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన తేదీ: 14-9-2021

దళిత బంధు సర్వే సమర్థవంతంగా పూర్తి చేసిన అధికారులకు అభినందనలు

ఇంతవరకు 14, 400 లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేసాము

నేటి నుంచి రీ సర్వే
దళిత కుటుంబాలందరికీ దళిత బంధు అమలు

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్
000000

హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బందు సర్వేను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అభినందించారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్లస్టర్ అధికారులు, ప్రత్యేక అధికారుల తో దళిత బంధు పై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు సర్వే విజయవంతంగా పూర్తి పూర్తిచేశామని, ఇప్పటివరకు 14,400 లబ్ధిదారుల ఖాతాల లో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. బుధవారం నుంచి అధికారులు రీ సర్వే చేస్తారని, దళిత కుటుంబాలందరికీ దళిత బంధు పథకం అమలవుతుందని అన్నారు. రీ సర్వే లో రేషన్ కార్డ్ లేని వారి వివరాలు తీసుకోవాలని, మైగ్రేట్ అయిన వారి వివరాలు కూడా తీసుకోవాలని, వాటన్నిటినీ ఆప్ లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వే లో భాగంగా బ్యాంకర్లను కూడా వెంట తీసుకెళ్లి గుర్తించిన కొత్త వారికి కూడా బ్యాంక్ అకౌంట్ లో తెరిపించాలని అన్నారు. మొదటిసారి సర్వే చేసినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే రీ సర్వే లో వారిని గుర్తించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఖాతాలో డబ్బులు జమ కాగానే సెల్ ఫోన్ లకు సంక్షిప్త సమాచారం వస్తుందని, దీన్ని అధికారులు దృవీక రించుకోవాలని అన్నారు. దళిత కుటుంబాల అందరికీ దళిత బంధు పథకం అమలు చేయడంతో పాటు వారి ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమ ఆగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, క్లస్టర్ అధికారులు, ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ గారిచే జారీ చేయడమైనది.

Share This Post