ప్రణాళిక ప్రకారం రోజువారీ కార్యక్రమాలు నిర్వహించి దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి …..జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రణాళిక ప్రకారం రోజువారీ కార్యక్రమాలు నిర్వహించి దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి …..జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

ప్రణాళిక ప్రకారం రోజువారీ కార్యక్రమాలు నిర్వహించి దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి …..జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

*రైతు వేదికల కేంద్రంగా రైతు దినోత్సవం నిర్వహణ

*ప్రతి ప్రోగ్రాం ఫోటోగ్రాఫీ, వీడియోగ్రాఫీ తో రికార్డు చేయాలి

*భోజన సౌకర్యాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి

*దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై అధికారు లతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, మే -30:

ప్రణాళిక ప్రకారం రోజువారీ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అన్నారు.

మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి రోజూ నిర్వహించు కార్యక్రమాలను ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని, కార్యక్రమం మొదలు నుంచి ముగింపు వరకు ప్రతి అంశాన్ని ముందుగా ఎవరు, ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అనే అంశం నిర్ధారించుకొని, విధులను కేటాయించుకొని, ఎటువంటి లోటు పాట్లు లేకుండా, ప్రశాంతంగా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని, కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం కనబర్చిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ప్రతి కార్యక్రమంతో పాటు, ప్రత్యేకంగా జూన్ 3న రైతు దినోత్సవం, జూన్ 7న సాగునీటి దినోత్సవం, జూన్ 8న ఊరూరా చెరువుల పండుగ నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు. *జిల్లాలో ఉన్న 54 రైతు వేదికలలో రైతు దినోత్సవం నిర్వహించాలని, ఎంపిడిఓ, ఎంపిఓ, తహసిల్దార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించాలని అన్నారు

రైతు వేదిక క్లస్టర్ పరిధిలో ఉన్న 3, 4 గ్రామాల నుంచి రైతులను ట్రాక్టర్, ఎడ్ల బండ్లలో ర్యాలీ లాగా ఉదయం 10 గంటల లోపు రైతు వేదికలను చేరుకోవాలని, వ్యవసాయ శాఖలో సాధించిన ప్రగతి గ్రామాల వారీగా రైతులకు తెలియ జేయాలని, రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ మొదలగు వివిధ పథకాల ద్వారా ప్రతి రైతుకు జరుగుతున్న లబ్ది, యాసంగి లో ముందస్తు సాగు ప్రణాళిక, ఆయిల్ పామ్ సాగు కు ప్రభుత్వం అందిస్తున్న సబ్సీడీల పై ప్రత్యేకంగా వివరించాలని కలెక్టర్ తెలిపారు.

రైతుబంధు సమితి సభ్యులతోసమన్వయం చేసుకుంటూ రైతులను సమీకరించాలని, క్లస్టర్ వారీగా ప్రత్యేక అధికారులను నియమించాలని, రైతు వేదిక దగ్గర ఏర్పాట్లు ప్రత్యేకంగా పరిశీలించాలని, పరిసరాల పరిశుభ్రత, భోజన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, ఎక్కడా తోపులాటలు జర్గకుండా జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ తెలిపారు. భోజనం సుచి,శుభ్రతతో రుచిగా ఉండాలని, ఓపికతో ఉండే వారు వడ్డించేలా చూడాలని అన్నారు.

జూన్ 7న సాగునీటి దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ పరిధిలో వేడుకలు నిర్వహించాలని, సాగునీటి రంగంలో సాధించిన విజయాలు ఘనంగా చాటాలని కలెక్టర్ తెలిపారు. జూన్ 8న నిర్వహించు ఊరూరా చెరువుల పండుగ కోసం ప్రజా ప్రతినిధులను సంప్రదించి ప్రతి గ్రామంలో పెద్ద చెరువు ఎంపిక చేయాలని, చెరువు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఊరూరా చెరువుల పండుగ సందర్భంగా ప్రతి గ్రామంలో వేడుకలు, భోజన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని , బతుకమ్మ, బోనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహించాలని, కట్ట మైసమ్మ పూజ చేయాలని కలెక్టర్ తెలిపారు. చెరువు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన మార్పు, పెరిగిన మత్స్య సంపద, పంటలు విస్తిర్ణం తదితర అంశాలపై స్పష్టంగా వివరించాలని అన్నారు.

ఊరూరా చెరువుల పండుగ నిర్వహణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంచుకోవాలని, దశాబ్ది వేడుకల ప్రతి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఫోటోగ్రఫీ, వీడియో గ్రాఫీ రికార్డు చేయాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో జెడ్పీ సి. ఈ. ఓ. శ్రీనివాస్, డి.ఆర్.డి. ఓ. శ్రీధర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, పి. ఓ. చంద్రమౌళి, మండల ప్రత్యేక అధికారులు,ఎంపీడీఓ లు, ఎం.పి. ఓ లు, ఏ. ఓ.లు, ఏ. ఈ. ఓలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post