కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

పత్రికా ప్రకటన

మహబూబాబాద్, జూన్.1

మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం వారు జారీ చేసిన కొత్త మిషన్ శక్తి నియమ నిబంధనలు మరియు ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం హైదరాబాదు వారి ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ నందు కాంట్రాక్ట్ బేసిస్ లో మార్చ్. 2026 వరకు పని చేయుటకు గాను జిల్లా మిషన్ కోఆర్డినేటర్ ఒక పోస్టు స్పెషల్ ఇన్ ఫైనాన్స్ లిటరసీ ఒక పోస్టు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒక పోస్ట్ నకు దరఖాస్తు చేసుకోగలరని జిల్లా సంక్షేమ అధికారి ఆర్.వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారు.

జిల్లాకు చెందిన అర్హత గల మహిళ, పురుష అభ్యర్థులను HTTPS://docs.google.com/forms/d/1rWEhCw8BFaMLshwpVjA7LqbfrDyQzy3Tw2hjblmZpc/edit?Pli=! లింకు ద్వారా ఆన్లైన్లో మరియు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల రెండవ తేదీ నుండి 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు కలెక్టరేట్ లోని రూమ్ నెంబర్. 12 నందు అన్ని ధ్రువపత్రంలను గెజిటెడ్ ఆఫీసర్ తో ధ్రువీకరణ చేయించి సమర్పించాల్సిందిగా తెలిపారు. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను స్వీకరించబడవని, షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు మౌఖిక ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 15వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహిస్తారని తెలిపారు.

ఒక పోస్టు ఉన్నటువంటి జిల్లా మిషన్ కోఆర్డినేటర్ పోస్టుకు 38,500 వేతనాన్ని నిర్ణయిస్తూ, సోషల్ సైన్స్/ లైవ్ సైన్స్/ న్యూట్రిషన్ మెడిసిన్/ హెల్త్ మేనేజ్మెంట్/ సోషల్ వర్క్/ రూరల్ మేనేజ్మెంట్లో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలని గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో కనీసం మూడు సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలని ఈ పోస్టుకు మహిళలు మాత్రమే అర్హులని తెలిపారు.

స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ ఒక పోస్ట్ నకు 22,750 రూపాయల వేతనానికి గాను ఎకనామిక్స్ బ్యాంకింగ్ సంబంధిత ఇతర విభాగాల్లో డిగ్రీ కలిగి ఉండాలని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడునని గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఫైనాన్షియల్ లిటరసి/ఫైనాన్స్ ఇంక్లూజన్ కు సంబంధించిన విషయంలో కనీసం మూడు సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలని ఈ పోస్టునకు మహిళలుమాత్రమే అర్హులని తెలిపారు.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒక పోస్ట్ కు15,600 రూపాయల వేతనాన్ని నిర్ణయిస్తూ పదవ తరగతి పాస్ అయిన వారు, ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 + 2 విధానము కింద పాస్ అయిన వారు అర్హులని తెలిపారు. పైన తెలిపిన పోస్టులకు 1- 7- 2023 నాటికి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 44 సంవత్సరాల వయాపరిమితి) తెలిపారు.
.

Share This Post