15 నుండి 17 సంవత్సరాల వారికి వేగవంతంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి – కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్

ఇంటింటి ఆరోగ్య సర్వే పకడ్బందీగా చేపట్టాలి..

ఆరోగ్య పరిస్థితులను నమోదు చేయాలి

కరోనా లక్షణాలు ఉంటే ఐసొలేషన్‌ కిట్లు అందజేయాలి

15 నుండి 17 సంవత్సరాల వారికి వేగవంతంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి

అధికారులతో సమావేశంలో కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్

జిల్లాలో శుక్రవారం నుండి ఇంటింటి సర్వే చేపట్టాలని, ఆరోగ్య పరిస్థితులను నమోదు చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్ ఆర్ అధికారులకు ఆదేశించారు.
గురువారం అధికారులతో కొవిడ్‌ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.
జ్వరం లక్షణాలు ఉన్న వారికి హోమ్ ఐసొలేషన్‌ మెడికల్ కిట్లు అందజేయాలన్నారు.
సర్వే కోసం మెడికల్‌ ఆఫీసర్లు, హెల్త్‌ సూపర్‌వైజర్ల పర్యవేక్షణలో గ్రామస్థాయిలో ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్త, వీఆర్‌ఏతో, మున్సిపాలిటీల్లో ఏఎన్‌ఎం, మున్సిపల్‌, మెప్మా, అంగన్‌వాడీ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.
మెడికల్‌ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఎంపీవో, ఎంపీడీవోలు హెల్త్‌ టీములపై పర్యవేక్షించాలని సూచించారు.
జిల్లాలోని 2 లక్షల గృహ సముదాయాలకు ఆరోగ్య సర్వే నిర్వహించాలని ఆదేశించారు.
1000 టీముల ద్వారా ప్రతిరోజు ఇరవై ఐదు ఇండ్లను సర్వే చేయాలని ఆదేశించారు.
15 వయసు నుంచి 17 సంవత్సరాల వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, విద్యాశాఖ, ఇంటర్మీడియట్ శాఖల అధికారులు విద్యార్థుల ఫోన్ నెంబర్లతో పూర్తి స్థాయి సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అందజేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఫ్రంట్ లైన్ వర్కర్లుకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రజలందరూ 2డోసుల వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించి 100% వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు.
ప్రజలందరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు
ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్, డి పి ఓ కృష్ణయ్య, ఇమ్యునైజేషన్ అధికారి సాయినాథ్ రెడ్డి, డాక్టర్ రోహిత్, విద్యాశాఖ అధికారులు ఈశ్వరప్ప, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post