15 నుండి 18 సవత్సరాల వయస్సు గల యువకులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేసుకోవాలి :-జిల్లా కలెక్టర్ డి హరిచందన

15 నుండి 18 సవత్సరాల వయస్సు  గల యువకులు తప్పనిసరిగా  వ్యాక్సినేషన్ వేసుకోవాలి :-జిల్లా కలెక్టర్ డి హరిచందన

నేటి నుండి 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతి యువకులకు   వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినదని దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.    జిల్లా లో ఉన్న 15 నుండి 18 వయస్సు గల విద్యార్థులు, యువకులు అందరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలని తెలిపారు.  సోమవారం ఉదయం  జిల్లా కేంద్రం లోని జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ సెంటర్ ను  కలెక్టర్  తనిఖీ చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అదేశానుసారంగా జిల్లా లో  యువకులకు   వ్యాక్సిన్ వేయాలని ఆన్ లైన్ ద్వారా స్లాట్   బుక్ చేసుకొని  కేటాయించిన  రోజున సంబంధిత ఆసుపత్రి లో వ్యాక్సిన్ వేసుకోవాలని  కలెక్టర్ సూచించారు. విద్య సంస్థ లలో ఉన్న విద్యార్థిని, విద్యార్థులకు వారు అధ్యాపకుల ద్వారా 15 నుండి 18 సత్సరాల యువతి యువకు లకు వ్యాక్సిన్ వేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.  జిల్లా లో 15 నుండి 18 సవత్సరాల వయస్సు కలిగిన వారు ఎంతమంది ఉన్నారో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాం మనోహర్, జిల్లా ఆసుపత్రి సూపరిడెంట్ డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ శైలజ, డాక్టర్ బాలాజీ రావు మరియు సరోజ తదితరులు పాల్గొన్నారు.

Share This Post