15 వ ఆర్థిక సంఘానికి వైద్య ఆరోగ్య శాఖ తరపున పంపే ప్రతిపాదనలపై నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం.

15 వ ఆర్థిక సంఘానికి వైద్య ఆరోగ్య శాఖ తరపున పంపే ప్రతిపాదనలపై నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.  రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత మెరుగైన వైద్య, ఆరోగ్య సదుపాయాలను కల్పించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను సి.ఎస్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాలను పటిష్ట పర్చడం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కొన్నింటిని మండల పబ్లిక్ హెల్త్ యూనిట్ గా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా,  వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, మున్సిపల్ శాఖ కమీషనర్ డా. సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి కరుణ, వైద్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస రావు, వైద్య విద్యాశాఖ సంచాలకులు రమేష్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ఓ.ఎస్.డి. గంగాధర్ తదితరులు హాజరయ్యారు.

Share This Post