15.09.2021 Nalgonda Dist *తుది దశ నిర్మాణం లో ఉన్న వైకుంఠ దామం లు నెలాఖరు లోగా పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్* *ఎం.పి.డి.ఓ.లు,ఎం.పి.ఓ.లు,పి.ఆర్.ఏ.ఈ. లు,ఏ.పి.ఓ.లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైకుంఠ దామం ల నిర్మాణ ప్రగతి,హరిత హారం సమీక్షించిన కలెక్టర్***

నల్గొండ, సెప్టెంబర్ 15.జిల్లాలో తుది నిర్మాణ దశలో ఉన్న వైకుంఠ దామం లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఎం.పి.డి.ఓ.లు,ఎం.పి.ఓ.లు,ఏ.పి.ఓ.లు,ఏ.ఈ. పి.ఆర్.లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మండలం ల వారీగా వైకుంఠ దామం ల నిర్మాణ పనుల ప్రగతి,హరిత హారం పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుది దశ నిర్మాణం లో ఉన్నవి ఈ నెలాఖరు లోగా పూర్తి చేయటమే కాక ఆన్లైన్ లో  పొందు పర్చాలని ఆదేశించారు. ఇప్పటికే పనులు పూర్తి చేసిన వైకుంఠ దామం ల ప్రగతి ఆన్లైన్ లో ఆప్ లోడ్ చేయకుంటే ఈ నెల 25 లోగా ఆన్లైన్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మండలాల వారీగా నిర్మాణం ల ప్రగతి,ఆన్ లైన్ లో ఆప్ లోడ్ చేయడం, ఖర్చు చేసిన వివరాలు సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు.ఇంకా వివిధ దశలలో నిర్మాణం లో ఉన్న వైకుంఠ దామం లను అక్టోబర్ 10 లోగా నిర్మాణం పనులు,వైకుంఠ దామం లలో టాయిలెట్స్, బర్నింగ్ ప్లాట్ పాం, వెయిటింగ్ హాల్ లాంటి నిర్మాణం లు కూడా పూర్తి చేయాలని అన్నారు.ఇసుక సమస్య ఉంటే పరిష్కరిస్తామని తెలిపారు. ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా పంచాయతీ అధికారి,పంచాయతీ రాజ్ ఈ ఈ దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించు కోవాలని సూచించారు.హరిత హారం హోమ్ స్టెడ్ ప్లాంటేషన్ కింద ఇంటింటికి  6 మొక్కలు చొప్పున పంపిణీ చేసిన మొక్కలు జియో ట్యాగింగ్  చేయాలని అన్నారు.పల్లె ప్రకృతి పనులు,బృహత్ పల్లె ప్రకృతి వనం ల ఏర్పాటు లో నాటిన మొక్కలు,ఇతరత్రా పనులకు ఈ. జి.యస్.ద్వారా చెల్లింపులు వెంటనే చేయాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్,జడ్.పి.సి.ఈ. ఓ.వీర బ్రహ్మ చారి,పంచాయతీ రాజ్ ఈ ఈ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు

Share This Post