15-11-2021 ప్రజావాణి పిర్యాదులు

: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఇన్చార్జి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖలకు అందజేసి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈ. డి . దయానంద్, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యాన అధికారి సంజీవ రావు, ఇన్చార్జి డీపీవో రాజేంద్ర ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. –—————– జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Revenue 43
Dao 1
Endowments 2
Dpo 7
Electricity 2
Forest 1
Marketing 1
Muncipal 1
Drdo 1
S.P 1
Total 60

Share This Post