15-18 సంవత్సరాల విద్యార్థులు నిర్భయంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సూచించారు. 15-18 సంవత్సరాల వారికి జరుగుతున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను బుధవారం ఖమ్మం రూరల్ కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ పరిశీలించారు.

ప్రచురణార్ధం

జనవరి,05 ఖమ్మం:

15-18 సంవత్సరాల విద్యార్థులు నిర్భయంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సూచించారు. 15-18 సంవత్సరాల వారికి జరుగుతున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను బుధవారం ఖమ్మం రూరల్ కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా. విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా తమతో పాటు తోటి వారు కూడా సురక్షితంగా ఉంటారని, ప్రస్తుతం కోవాక్సిన్ టీకా ఇస్తున్నారని, టీకా వల్ల ఎటువంటి దుష్ప్రభావం ఉండదని, భయభ్రాంతులకు లోను కాకుండా నిర్భయంగా టీకా తీసుకోవాలని విద్యార్థినులకు కలెక్టర్ భరోసా కల్పించారు. ప్రస్తుతం మొదటి డోసు టీకా తీసుకుంటున్న విద్యార్థినులు అందరూ 28 రోజుల అనంతరం. తప్పనిసరిగా రెండవ డోసు టీకా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 8 నుండి 16 వ తేదీ వరకు సెలవుల్లో ఇండ్లకు వెళ్తున్న నేపథ్యంలో తమ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్-19 టీకా వేసుకునేలా తల్లి దండ్రులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి టీకాలు వేయించాలని కలెక్టర్ తెలిపారు. కస్తూరీలా గాంధీ బాలికల విద్యాలయంలో 177 మంది విద్యార్థినీలు టీకాకు అర్హులు కాగా వారందరికి కూడా టీకా వేస్తున్నట్లు డాక్టర్ శ్రీదేవీ, ప్రిన్సిపల్ అసియాబేగం కలెక్టరు కు వివరించారు. అనంతరం కస్తూరీభా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి విద్యార్థినుల వసతి, భోజనం, ఏర్పాట్లను తణిఖీ చేసారు. విద్యాలయ ప్రాంగణంలో పిచ్చిమొక్కలను తొలగించాలని, నీటి నిల్వ లేకుండా పరిశుభ్రత పనులను వెంటనే చేపట్టాలని, అపరిశుభ్ర వాతావరణం వల్ల సీజనల్ వ్యాధులు ప్రభలుతాయని, ముందస్తు నియంత్రణ చర్యల ద్వారా విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ చర్యలు సత్వరమే చేపట్టాలని విద్యాలయ ప్రిన్సిపల్ను కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి అప్పారావు, ఇంచార్జ్ తహశీల్దారు కరుణశ్రీ, ఎం.పి.డి.ఓ. శ్రీనివాస్ రావు, ఎం.పి.పి. బెల్లం ఉమ , విద్యాలయ ఉపాధ్యాయులు, వైద్యాధికారులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post