ప్రెస్ రిలీజ్. తేది 07.08.2021 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. శనివారం నాడు కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై తీసుకోవలసిన చర్యలను శాఖల వారీగా ఆయన సమీక్షించారు. హార్టికల్చర్, పల్లె ప్రగతి, ఆరోగ్యం, ఐ సి డి ఎస్, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, మత్స్యశాఖ సంబంధించిన అధికారులు స్టాళ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్య శాఖ ఆధ్వర్యంలో మూడు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, ఆర్డిఓ శీను, డి పి ఓ సునంద, జిల్లా అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy