16 న సామూహిక జాతీయ గీతాలాపన– కార్యక్రమ విజయవంతం కు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలి- జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

16 న సామూహిక జాతీయ గీతాలాపన

– జిల్లాలోని ప్రజలందరూ విధిగా పాల్గొనేలా చూడాలి

– కార్యక్రమం జరిగేటప్పుడు క్రమశిక్షణ పాటించాలి.

– కార్యక్రమ విజయవంతం కు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలి

– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

——————————

——————————
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16 న ఉదయం 11.30 గంటలకు జిల్లా వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

శనివారం సాయంత్రం సామూహిక జాతీయ గీతాలాపన ఏర్పాట్ల పై అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మార్గ నిర్దేశనం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో ప్రజలందరూ జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. 16 న సరిగ్గా ఉదయం 11. 30 గంటలకు సామూహిక జాతీయ ప్రారంభమవుతుందని, జాతీయ గీతాలాపన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఆయన కొన్ని సూచనలను చేశారు.

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలోని అన్ని వార్డులు, ముఖ్యమైన ట్రాఫిక్ జంక్షన్లు, గుర్తింపు పొందిన ముఖ్యమైన ప్రదేశాలు, అన్ని సంస్థలు , పాఠశాలలు , కళాశాలలు, అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్ స్థలాలు, అన్నిచోట్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున జాతీయ గీతాన్ని ఆలపించాలని కోరారు.

జాతీయ గీతాలపన సమయంలో ప్రతి ఒక్కరూ నిశ్శబ్దాన్ని పాటించాలని, అంతేకాక ప్రతి ఒక్కరూ ఎలాంటి కదలిక లేకుండా ఉన్నచోటే జాతీయ గీతం ఆలపించాలని తెలిపారు.

ప్రత్యేకించి జిల్లా కేంద్రంలో జాతీయ గీతాలాపన సందర్భంగా పట్టణంలో ముఖ్య ప్రదేశాలలో మైకులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సరిగ్గా ఉదయం 11. 25 నిమిషాలకు రహదారులపై ట్రాఫిక్ ను నిలిపివేయడం జరుగుతుందని, 11. 30 గంటలకు మైకుల ద్వారా సైరన్ ఇవ్వడం జరుగుతుందని , తర్వాత 11. 30 గంటల నుండి ఒక నిమిషం పాటు జాతీయ గీతం ఆలపించాలని, ఈ సమయంలో ప్రతి ఒక్కరు నిశ్శబ్దం పాటించడమే కాకుండా, పట్టణంలోని అన్ని సంస్థలు, షాపుల వారు బయటకు వచ్చి జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆయన సూచించారు. ఇదే సమయంలో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు , మున్సిపల్ వార్డులలో కూడా జాతీయ గీతాన్ని ఆలపించాలని తెలిపారు.

సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొనడాన్ని అదృష్టంగా భావించాలి

ఈ గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం లభించటం అరుదైన అదృష్టంగా భావించాలన్నారు . ప్రజలు , యువత , విద్యార్థులు , ప్రజాప్రతినిధులు , ఉద్యోగులు ఎక్కడి వారు అక్కడే నిలబడి గీతాన్ని ఆలపించాలన్నారు . జాతీయ గీతాలాలన సమయంలో క్రమశిక్షణ ముఖ్యమని స్పష్టం చేశారు.

సామూహిక జాతీయ గీతాలాపన అందరి కార్యక్రమం

సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఏ ఒక్క శాఖ కార్యక్రమమో కాదని జిల్లా కలెక్టర్ అన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖలు, సబ్బండ వర్గాల ప్రజల కార్యక్రమం అని చెప్పారు.
జిల్లాలోని వంద శాతం ప్రజలు పాల్గొనే లా కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలన్నారు.

టెలీ కాన్ఫరెన్స్ లో ఎస్పీ రాహుల్ హెగ్డే , అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఖీమ్యా నాయక్, ఆర్డీఓ లు టి శ్రీనివాస్ రావు, లీల, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు
——————————
.

Share This Post