16.08.2021 Nalgonda Dist కొండ మల్లే పల్లి,పి.ఏ.పల్లి,పెద్ద వూర మండలం,హాలియా పట్టణం లో పర్యటించి అవెన్యూ ప్లాంటేషన్,బృహత్ పల్లె ప్రకృతి వనం లు పరిశీలించిన కలెక్టర్* * గ్రామాలు పచ్చదనం వెల్లి విరియాలి

కొండ మల్లే పల్లి,పి. ఏ.పల్లి,పెద్ద వూర,హాలియా,ఆగస్ట్ 16.గ్రామాల్లో రహదారుల వెంట నాటిన మొక్కలు సంరక్షించి మొక్కల ఎదుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కొండ మల్లే పల్లి,పి.ఏ.పల్లి,పెద్ద వూర మండలం లలో పలు గ్రామాల్లో,హాలియా మున్సిపాలిటీ లో పర్యటించి అవెన్యూ ప్లాంటేషన్,బృహత్ పల్లె ప్రకృతి వనం లు పరిశీలించారు. గ్రామాలు ఆరోగ్యకర వాతావరణం తో పచ్చదనం తో వెల్లి విరియాలని,హరిత హారం,పల్లె ప్రగతి లో రహదారులు,బృహత్ పల్లె ప్రకృతి వనం లలో నాటిన మొక్కలు పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ కు వాటరింగ్,రక్షణకు ట్రీ గార్డ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.
కొండ మల్లె పల్లి మండలం గుమ్మడ వల్లి, చిన్న అడిశేర్ల పల్లి గ్రామపంచాయతీ లో రహదారి  ఇరువైపులా ఆవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించి,  చిన్న గా ఉన్న మొక్కలు  పెరుగుటకు మొక్క కు సపోర్ట్ గా  కర్రలు, .ట్రీ గార్డ్ ఏర్పాటు చేసుకోవాలని, వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ ట్యాంకర్ ద్వారా నీటి సౌకర్యం, గ్యాప్ ఉన్న చోట మొక్కలు  నాటాలని, గ్రామ పంచాయతీ నిధులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారుల కు సూచించారు.
పి.ఏ పల్లి మండలం చిలకమర్రి గ్రామ పంచాయతీ లో రహదారి  ఇరువైపుల ఆవెన్యూ ప్లాంటేషన్  పరిశీలించి, మొక్కల చుట్టు పిచ్చి మొక్కలు,గడ్డి తొలగించి పాదులు చేయాలని, వాటర్ ట్యాoకర్ ద్వారా మొక్కలకు నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.
 రోళ్ళకల్  గ్రామ పంచాయతీ లో , అంగడిపేట  గ్రామ పంచాయతీ లో రహదారి ఇరువైపులా మొక్కలు పరిశీలించి పెద్ద మొక్కలు నాటాలని, మొక్కలకు ఎరువు వేయాలని  ఆయన ఆదేశించారు.  అక్కంపల్లి  గ్రామ పంచాయతీ లో రోడ్లు ఇరువైపులా మొక్కలు పరిశీలించి, పెద్ద మొక్కలు నాటాలని, ఎరువులు వేయాలని,  వాచర్ ద్వారా మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని,వాచర్ కు నెల నెల పేమెంట్ చేయాలని అధికారులను  కలెక్టర్ ఆదేశించారు.
 కోదండపూర్ , ఘట్ నెమలి పురం గ్రామ పంచాయతీ లో ఆవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించారు.
పెద్దవూర మండలం పోతునూరు గ్రామపంచాయతీలో ఎవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించారు.
 పెద్దవూర గ్రామపంచాయతి
పెద్దవూర మండలం బొట్టు గూడెం గ్రామపంచాయతీలో  రోడ్లు ఇరువైపులా పరిశీలించి రహదారి వెంబడి గ్యాప్ లో మొక్కలు నాటాలని సూచించారు.
 తేపాలమడుగు  గ్రామపంచాయతీలో మొక్కలు పరిశీలించి,మొక్కలు వంగకుండా మొక్కలకు సపోర్టు గా కర్ర ఏర్పాటు చేసి, పెద్ద మొక్కలు నాటాలని ఆదేశించారు.
పెద్దవూర మండలం లింగం పల్లి జి.పి.లో
హాలియా మున్సిపాలిటీ లో రోడ్డుపై ఇరువైపులా మొక్కలు, బృహత్ పల్లె ప్రకృతి వనం పరిశీలించారు.అధికారులు పర్యవేక్షిస్తూ మొక్కలు పెరిగేందుకు,సంరక్షణ కు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్,ఎం.పి.డి. ఓ లు,తహశీల్దార్ లు,ఎం.పి.ఓ.లు,గ్రామ కార్యాదర్శిలు, ఇతర అధికారులు పాల్గొన్నారు

Share This Post