ఆగష్టు 06, 2021 – ఆదిలాబాదు:-
ఆదిలాబాద్ జిల్లా ప్రజాపరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈ నెల 17 న నిర్వహించనున్నట్లు ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం గం.10.30 ని. ల నుండి సాయంత్రం 4 గంటల వరకు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, సాంఘీక సంక్షేమం, పన్నులు, ప్రణాళిక, ఆర్థిక స్థాయి సంఘాల సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ఇట్టి సమావేశానికి సకాలం లో పూర్తీ నివేదికలతో హాజరు కావాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. ప్రగతి నివేదికలను ఈ నెల 12 లోగా తన కార్యాలయానికి 30 ప్రతులలో సమర్పించాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
……………………………………………………………. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.