17-08-2021 *హాలియా,నందికొండ పట్టణాల అభివృద్ధి పై సమీక్ష*

హాలియా,నంది కొండ,ఆగస్ట్ 17. నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా లో,నంది కొండ మున్సిపాలిటీ లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు,చేపట్టనున్న అభివృద్ధి పనులు,పట్టణం లో మౌలిక వసతుల కల్పన పై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,స్థానిక శాసన సభ్యులు నోముల భగత్ తో కలిసి చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల హాలియా పర్యటనలో నియోజకవర్గ ప్రగతి సమీక్ష లో  ప్రత్యేకంగా హాలియా పట్టణ అభివృద్ధి కి 15 కోట్లు,నంది కొండ మున్సిపాలిటీ కి 15 కోట్ల రూ.లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్,ఆర్.డి.ఓ.,మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్ లు మున్సిపాలిటీ,ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్ అధికారులతో హాలియా పట్టణం లో ఎం.పి.డి. ఓ.కార్యాలయం లో,నంది కొండ లో నంది కొండ మున్సిపాలిటీ లో  సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంల లో రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రకటించిన హాలియా పట్టణం లో 15 కోట్ల రూ.ల నిధులతో,నంది కొండ పట్టణం లో 15 కోట్ల రూ.లతో,మొత్తం 30 కోట్ల రూ.లతో చేపట్టనున్న పనుల పై ప్రాథమికంగా చర్చించారు. హాలియా పట్టణంలో మౌలిక వసతులు కల్పన కు 9 కోట్ల అంచనా తో రోడ్లు,6 కోట్ల రూ.ల అంచనా తో డ్రైన్ లు నిర్మించాలని మున్సిపాలిటీ అధికారులు ప్రతి పాదనలు రూపొందించారు. హాలియా మున్సిపాలిటీ లో వెజ్,నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 2 కోట్లతో నిర్మాణం చేసేందుకు టెండర్ ఖరారు చేయడం జరిగింది.ఒక కోటి రూపాయలతో వైకుంఠ దామం నిర్మాణం కు టెండర్ అయినట్లు,పట్టణ ప్రగతి నిధులతో డి.ఆర్.సి.సెంటర్ కంపోస్టు షెడ్ డంప్ యార్డ్ అభివృద్ధి,2 స్మశాన వాటికలు టెండర్ దశలో ఉన్నట్లు హాలియా మున్సిపల్ కమిషనర్ వివరించారు.షాదీఖానా నిర్మాణం పై శాసన సభ్యులు చర్చించారు.నంది కొండ మున్సిపాలిటీ లో అభివృద్ధి, ముఖ్య మంత్రి ప్రకటించిన నిధులతో చేపట్టే పనుల ప్రతి పాదనలు పై చర్చించారు.
నంది కొండ మున్సిపాలిటీ లో వెజ్,నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం,షాదీఖానా, వైకుంఠ దామాలు,చిల్డ్రన్ పార్క్,బస్ స్టాండ్,లైబ్రరీ,డ్రైనేజీ,సి.సి.రోడ్డు లు,మున్సిపాలితే కమ్యూనిటీ హాల్,పలు అభివృద్ధి పనుల పై
చర్చించారు. ఈ సమావేశం లో మిర్యాలగూడ ఆర్.డి.ఓ.రోహిత్ సింగ్,హాలియా మున్సిపల్ చైర్ పర్సన్ పార్వతమ్మ,తహశీల్దార్ మంగ, ప్రజా రోగ్య శాఖ ఎస్ ఈ కందుకూరి వెంకటేశ్వర్లు, హాలియా మున్సిపాలిటీ కమిషనర్ వేమా రెడ్డి,నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘు వీర్,తహశీల్దార్ సైదులు, కమిషనర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Share This Post