17-12-2021 ఇంధన పొదుపు కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్ రెడ్ కో నిజామాబాద్ ఆధ్వర్యంలో కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో శుక్రవారం ఇంధన పొదుపు పై అవగాహన డెమో స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రజలకి ఇంధన పొదుపు, సోలార్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ స్టాల్ ను జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ , సి పి ఓ రాజారాం , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ సందర్శించారు. టీఎస్ రెడ్ కో జిల్లా మేనేజర్ బి. గంగాధర్ ఇంధన పొదుపు పై టీఎస్ రెడ్ కో చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపు కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రతినిధులు అరుణ్ కుమార్, జగదీప్ రామ్, ఉదయ్ పాల్గొన్నారు. —————– జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది.

Share This Post