170 మంది విఆర్ఓ లను వివిధ శాఖలకు కేటాయింపు

170 మంది విఆర్ఓ లను వివిధ శాఖలకు కేటాయింపు

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు  కేటాయింపులు  జారి

వెంటనే విధులలో చేర్చుకోవాలని అధికారులకు ఆదేశం

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

0 0 0 0

 

      ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 170 మంది విఆర్ఓ లను వివిధ శాఖలకు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

      సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో డ్రా పద్దతి ద్వారా వీఆర్వోలను వివిధ శాఖలకు కేటాయించారు. ప్రస్తుతం విఆర్ఓ గా విధులు నిర్వహించే వారందరిని వివిధ శాఖలకు బదిలిచేస్తున్నట్లు  జి.ఓయంఎస్. నెం.121 ఫైనాన్స్ (హెచ్.ఆర్.ఏం-VII) శాఖ, తేది 23-07-2022 ను ప్రభుత్వం జారిచేసింది, జారిచేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 170 మంది విఆర్ఓ లను వివిధ ప్రభుత్వ శాఖలలో సమాన స్థాయి కలిగిన పోస్టులను గుర్తించడంతో పాటు వారందరిని బదిలిచేయడం జరిగిందని అన్నారు.  ఆ శాఖలోని సమానస్థానంలో వెంటనే చేర్చుకోవాల్సిందిగా ఆయాశాఖల అధికారులను కూడా ఆదేశించడంతో పాటు వెంటనే కేటాయించిన శాఖలో వెంటనే జాయిన్ అవ్వాలని విఆర్ఓ లను కూడా ఆదేశించడం జరిగిందని తెలిపారు.  ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారితో పాటుగా సెలవులు,  సస్పెన్షన్, డిప్యూటేషన్ మరియు ఫారిన్ సర్వీసులో ఉన్నవారిని కూడా బదిలిచేయడం జరిగిందని.   బదిలిచేసిన వారందరిని వెంటనే విధులలో చేర్చుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్  ఆదేశించారు.\

     ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జీవి శ్యాం ప్రసాద్ లాల్, సంబంధిత శాఖల  జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post