18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీలు ప్రత్యేక చొరవ చూపాలని కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు.

శుక్రవారం నాడు జిల్లా కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలక్టర్ సంధ్యారాణి తో కలసి వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ పై సమావేశం నిర్వహించడం జరిగింది .
వరంగల్ ఈస్ట్ , వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలపై సమీక్షించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పోలింగ్ కేంద్రానికి గరిష్ఠంగా 1500 మంది ఓటర్లు మాత్రమే ఉండాలని అంతకన్నా ఎక్కువ ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి అవసరమైతే కొత్త భవనాలకు పోలింగ్ కేంద్రాలను కేటాయించాలని ఆదేశించారు. నవంబర్ 1వ తారీఖున ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అవుతుందని అన్నారు. నవంబర్ నెలలో శని , ఆదివారాలలో ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని ,2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యే వారు ఓటు కోసం దరఖాస్తులు చేసుకోనే విధంగా రాజకీయ పార్టీలు చొరవ చూపాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరిస్తూ అర్హులను ఓటర్లుగా మార్చాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. గరుడ యాప్ లో వంద శాతం పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని అందుకు కృషి చేసిన అధికారులను అభినందిస్తూ 2020- 21 సంవత్సరాలలో ఓటర్లుగా నమోదైన వారికి ఓటర్ గుర్తింపు కార్డులను డౌన్లోడ్ చేసుకునే విధంగా ఓటర్లలో అవగాహన కలిగించాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు.
డ్రాప్టు ఓటర్ల జాబితాను అన్ని కేంద్రాల వద్ద ప్రదర్శిస్తామన్నారు.

ఈ సమావేశంలో ఎలక్షన్ డిప్యూటీ తాహసిల్దార్ రామారావు, అన్వేష్
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి E v శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ నుంచి అమరేందర్ రెడ్డి, టీఆరెస్ పార్టీ నుంచి నాగేశ్వరరావు బీయస్పీ పార్టీ నుంచి సీతా రాజ్ కుమార్,సీపీఎం పార్టీ నుంచి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కే.శ్యామ్ సుందర్,ysrcp నుంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Share This Post