18 ఏళ్ళు దాటిన యువకులు ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో నమోదు కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గొయల్ అన్నారు

18 ఏళ్ళు దాటిన  యువకులు ప్రతి ఒక్కరూ   ఓటర్ జాబితాలో నమోదు  కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గొయల్ అన్నారు. 1-1-2022  తేదీని ప్రామాణికంగా తీసుకొని 18 సంవత్సరాల వయస్సు పూర్తి అయిన వారు అర్హులన్నారు.  శనివారం నారాయణపేట జిల్లాలో రాష్ట్ర ఎన్నికల అధికారి పర్యటించి దామరగిద్ద మండలంలో ని పోలింగ్ స్టేషన్, నారాయణపేట లో ఈ.వి.యం గోదామును పరిశీలించి సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, ఎస్పీ డా. చేతన ఇతర అధికారులతో జిల్లాలో  స్పెషల్ సమ్మరి రివిజన్ పై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి  ఒక పోలింగ్ బూత్ లో బూత్ లెవెల్ ఆఫీసర్ ను నియమించాలన్నారు. బూత్ లెవల్ అధికారులకు వారి బాధ్యతల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అన్ని బూత్ లెవెల్ ఆఫీసర్స్ కు గరుడ  యాప్ గురించి అవగాహన  కలిగి ఉండాలని తెలిపారు.  ఒకవేళ వాళ్లకు  అవగాహన లేకపోతే  అవగాహన కల్పించాలని  శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్లకు అవగాహన కల్పించాలన్నారు. కొత్త ఓటర్ల దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా సేకరించాలని వచ్చిన వాటిని బ్యూటీలేవల్ అధికారులు పరిశీలించి ఆన్లైన్ అప్లోడ్ చేయాలని తెలిపారు .ఆన్లైన్ లో ఇంతవరకు మొత్తం మండలాల్లో ఎన్ని  కొత్త దరఖాస్తులు వచ్చాయి అని అడిగి తెలుసుకున్నారు.  ఇప్పటి వరకు  దరఖాస్తులు తక్కువగానే  వచ్చాయని గ్రామ స్థాయిలో ప్రచారం కల్పించాలని   ఆదేశించారు .ఎక్కువ శాతం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులు సేకరించాలని ఆదేశించారు .ఆఫ్ లైన్ దరఖాస్తులు వచ్చిన వాటీని సైతం నిర్లక్ష్యం చేయకుండా   ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని కోరారు.  చనిపోయిన ఓటర్లను ఎంతమందిని జాబితా నుండి తొలగించారో  అడిగి తెలుసుకున్నారు.  డాటా  సరిగ్గా లేదని  ఆగ్రహం వ్యక్తంచేశారు . అలాగే ఓటర్ షిఫ్టింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. వాటిని కూడా  వెరిఫై చేసి అప్లోడ్ చేయమని కోరారు. డూప్లికేట్ ఓటర్లను జాబితా నుండి తొలగించారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. బూత్  లెవెల్ ఆఫీసర్స్ కు ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించార  లేదా అని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ డా. చేతన, అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి,  ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహశీల్దార్లు తదితరులు పాల్గున్నారు

Share This Post